
హీరోయిన్ ‘కృతి సనన్’ తెలుగు నేర్చుకోవడానికి మొదట తెలుగు యాప్స్ చుట్టూ కాలక్షేపం చేసిందట. కానీ తెలుగు అర్ధం కాక.. చివరకు పర్సనల్ మాస్టర్ ను కూడా పెట్టుకుంది. అయినా అమ్మడికి తెలుగు భాష సరిగ్గా ఎక్కట్లేదట. ఎందుకమ్మా అంటే.. తెలుగులో పదాలు పలకడానికే చాల కష్టంగా ఉందని చెబుతుందట. అలాగే గ్రామర్ కూడా విభిన్నంగా ఉందని.. సరైన అవగాహన లేకుండా తెలుగును ఎవ్వరూ నేర్చుకొలేరు అని కూడా స్టేట్ మెంట్ ఇస్తోందట. మొత్తానికి తెలుగు పట్ల ఈ బ్యూటీకి ఒక కొత్త మ్యాటర్ ఐతే అర్ధం అయింది.
అలా అని భాషను నేర్చుకోకుండా వదిలే ప్రసక్తి లేదని కూడా అమ్మడు అంటుంది. ఎదుకంటే కృతికి తెలుగు అంటే ప్రత్యేక ఇష్టం అట. ఎందుకు ఆ ఇష్టం అంటే.. ఈ హీరోయిన్ గారు హీరోయిన్ గా మారింది తెలుగు సినిమాతోనే. మొదట అనగా ఆమె మోడల్ గా వర్క్ చేస్తూ అవకాశాల కోసం అందరి చుట్టూ తిరుగుతున్న రోజుల్లో.. పెద్దగా ఆమెకు హిందీ సినిమాల్లో అవకాశాలు రాలేదు, అప్పుడే కృతి సనన్ ని పిలిచి మరీ ఆమెను తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేశాడు దర్శకుడు సుకుమార్. మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ ఆమె మొదటి చిత్రం.
అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఇక మిగిలిన తెలుగు స్టార్ హీరోలు ఆమె మొహం కూడా చూడలేదు. కానీ అదృష్టం కలిసి వచ్చి.. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి అనుకోండి. పైగా బాలీవుడ్ లో అమ్మడు హీరోయిన్ గా బాగా సక్సెస్ అయింది. వరుసగా అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో కృతి మళ్ళీ తెలుగు సినిమాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.
కానీ ఇన్నేళ్లకి మళ్ళీ ఆమె ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రలో నటించబోతుంది. ఈ సినిమా కోసమే ఆమె తెలుగు నేర్చుకోవడానికి తెగ కష్టపడుతుంది. అయితే , సెట్ లో తన పక్కనే ఉండే ప్రభాస్ తన బాధను చూసైనా తనకు తెలుగు నేర్పిస్తాడని అమ్మడు ఆశ పడుతుంది. మరి ప్రభాస్ ఆమెను ఆదుకుంటాడా ?