https://oktelugu.com/

Keerthi Suresh: నన్ను ఐరన్ లెగ్ అన్నారు.. ఎమోషనలైన స్టార్ హీరోయిన్ !

Keerthi Suresh: ‘కీర్తి సురేష్‘ మహానటి అంటూ నేషనల్ రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ  మహేష్ బాబు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే,  నన్ను ఐరన్ లెగ్ అన్నారు అని  ఈ  స్టార్ హీరోయిన్   ఎమోషనల్ అయింది.   కెరీర్ ప్రారంభంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని.. ఒకటి, రెండు సినిమాలు మొదలై ఆగిపోయే సరికి,  నా పై  ఐరన్ లెగ్ అని ముద్ర కూడా  వేశారని హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపింది.    నేను అప్పట్లో ఒక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 29, 2022 / 07:32 PM IST
    Follow us on


    Keerthi Suresh: కీర్తి సురేష్‘ మహానటి అంటూ నేషనల్ రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ  మహేష్ బాబు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే,  నన్ను ఐరన్ లెగ్ అన్నారు అని  ఈ  స్టార్ హీరోయిన్   ఎమోషనల్ అయింది.   కెరీర్ ప్రారంభంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని.. ఒకటి, రెండు సినిమాలు మొదలై ఆగిపోయే సరికి,  నా పై  ఐరన్ లెగ్ అని ముద్ర కూడా  వేశారని హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపింది. 

    keerthi suresh

     

    నేను అప్పట్లో ఒక స్టూడియోకి వెళ్ళాను. అక్కడ నన్ను చూసిన కొంతమంది..   నన్ను చూపించి  ‘ఆ కొత్తమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని కామెంట్స్ చేశారు.  ఆ సమయంలో  దాన్ని బాగా  ప్రచారం కూడా  చేశారు.   మొదట్లో బాధగా అనిపించినా, అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లానంది. ఒక సక్సెస్ రాగానే ఆ విమర్శలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయని చెప్పుకొచ్చింది  ఈ నేటి  మహానటి. 

    Also Read:  ఊ అంటావా ఉద్యోగి, ఊఊ అంటావా?
    ఏది అయితే ఏం   మహేష్ బాబు సరసన  ‘సర్కారు వారి పాట’ సినిమాలో  కీర్తి సురేష్  కీలక  పాత్రలో నటిస్తోంది.  మహేష్ కి సమానంగా ఈ రోల్ ఉంటుందని తెలుస్తోంది.  అలాగే తమిళ స్టార్ హీరో  విజయ్ సినిమాలో  కూడా  కీర్తి  సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది.  వంశీ  పైడిపల్లి  ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.  నిజానికి  దర్శకుడు వంశీ పైడిపల్లి  గతంలో మొదట తన  మహర్షి సినిమాలో కీర్తి సురేష్ నే హీరోయిన్ గా అనుకున్నారు.  

    keerthi suresh

     

    కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు మహేష్ – వంశీ పైడిపల్లి  సినిమాలో  కీర్తికి   ఛాన్స్ మిస్ అయింది.   ఎలాగూ సర్కారులో మహేష్ సరసన చేస్తోంది, ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాలో  కూడా  హీరోయిన్ గా  నటిస్తే.. ఆమె స్థాయి మరింతగా పేరినట్టే.  అయితే, కీర్తి నుంచి వచ్చిన  ‘గుడ్ లక్ సఖి’ సినిమా ప్లాప్ టాక్ తో నష్టాల వలయంలో చిక్కుకుంది.  మ‌హాన‌టితో   ‘కీర్తి సురేష్‘ ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది. 

     

    దాంతో ఆమె ప్రధాన పాత్రల్లో వస్తోన్న  సినిమాలు ఎక్కువైపోయాయి.  కాకపోతే  కీర్తి సురేష్ ఇటీవల నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద  విజయం సాధించలేక ప్లాప్ చిత్రాలుగా  మిగిలిపోతున్నాయి.  అందులోనే ఈ గుడ్ లక్ సఖి కూడా ఒకటి.

    Also Read:  కరోనా: ఏపీలో 11,573 కేసులు. మరణాలు.. తెలంగాణలో 3590.. పరిస్థితి ఎలా ఉంది?