Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే, ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నారని ఈ మధ్య కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఈ రీషూట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఇప్పటివరకు అలా రీ షూట్ చేసిన సీన్ ఒక్కటి కూడా లేదని తెలుస్తోంది. ఇవన్నీ కేవలం పుకార్లే అంటూ చిత్రబృందం చెబుతోంది. ఇక, ఈ మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

అయితే, మహేష్ ప్రస్తుతం కరోనాతో ఈ సినిమా షూటింగ్ కి దూరంగా ఉంటున్నాడు. కాగా కరోనా తగ్గాక, మహేష్ ఈ సినిమా షూట్ లో జాయిన్ కానున్నాడు. మహేష్ జాయిన్ అయ్యాక, ముందుగా ఒక పాటను షూట్ చేస్తారట. ఆ పాట షూట్ కోసం ‘గోవా’ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, పాట మాత్రం ఇంకా పూర్తి కాలేదు. సిద్ శ్రీరామ్ ముందుగా ఇచ్చిన డేట్ లో ట్యూన్ రెడీ అవ్వలేదు. దాంతో సిద్ శ్రీరామ్ డేట్ వేస్ట్ అయింది. తీరా ట్యూన్ రెడీ అయ్యేసరికి సిద్ శ్రీరామ్ డేట్ లేదు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్.
అందుకే, తమ సినిమా సాంగ్ షూట్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అని మహేష్ కి చెప్పాడు డైరెక్టర్. కానీ మహేష్ మాత్రం తన పలుకుబడితో మొత్తానికి సిద్ శ్రీరామ్ ను పాట పాడటానికి తీసుకొచ్చి పాట పాడించాడు. ఇక పాట తర్వాత గోవాలోని ఓ కామెడీ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. కాగా ఈ సీక్వెన్స్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు.
Also Read: ఆ సంస్థపై ట్రోల్స్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!
ఈ సీన్స్ ఎక్కువగా మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగుతాయట. ఈ సీన్స్ లో మహేష్ – కీర్తి మధ్య లవ్ బిల్డప్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట. అన్నట్టు ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ కలయికలో వచ్చే ప్యూర్ రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందట. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
అందుకే ఖర్చుకు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
[…] […]
[…] Anupama Parameswaran: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ అనగానే పద్దతిగా ఉంటుంది. అస్సలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా ఆ అమ్మాయి హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి అనుపమ గురించి. దీనికితోడు అనుపమ కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. అలాగే అనవసరమైన వివాదాలలో దూరి బూతు కామెంట్లు చేయడం లాంటివి కూడా ఎప్పుడూ అనుపమ చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది. […]