మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో స్వయంకృషితో ఎదిగిన హీరో. ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చి.. విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా.. ఇప్పుడు టాలీవుడ్ ఇలవేల్పుగా ఎదిగాడు. ఒక్కో మెట్టును కూర్చుకొని మెగాస్టార్ గా మారారు. ఈ క్రమంలోనే చిరంజీవి నట ప్రస్థానం తాజాగా 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి తనయుడు రాంచరణ్ సోషల్ మీడియాలో ఓ అరుదైన పోస్టర్ ను షేర్ చేశాడు. చిరంజీవి నటించిన మొదటి సినిమా పోస్టర్ తోపాటు తాజాగా విడుదలయ్యే ‘ఆచార్య’ మూవీ పోస్టర్ ను కలిపి అభిమానులతో పంచుకున్నారు.
‘43 సంవత్సరాల సినీ ప్రయాణం.. స్టిల్ రన్నింగ్.. మై అప్పా ’ అంటూ రాంచరణ్ తన తండ్రిపై ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు అయితే.. సెప్టెంబర్ 22 నటుడిగా చిరంజీవి కళామతల్లికి పరిచయం అయిన రోజు.
ఇక నటుడిగా 43 ఏళ్లు అయిన సందర్భంగా చిరంజీవి కూడా భావోద్వేగంతో స్పందించారు. ‘చిరంజీవిని ఈరోజు అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికీ నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మరిచిపోలేని రోజు’ అని చిరంజీవి సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’. ఈ సినిమాతో నటుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అయితే నటుడిగా విడుదలైన మొదటి మూవీ ‘ప్రాణం ఖరీదు’. చిరంజీవి తొలి సినిమాలో చంద్రమోహన్, జయసుధ హీరోహీరోయిన్లు.. ఈ సినిమాతోనే కోటా శ్రీనివాసరావు నటుడిగా పరిచయం అయ్యారు.
ప్రస్తుతం చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు.`కొరటాల శివ దర్శకుడు ‘ఆచార్య’గా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత వరుసగా చిరంజీవి చిత్రాలు ప్రకటించి బిజీ అయ్యారు.
43 years and still counting!
My Appa @KChiruTweets ❤️ pic.twitter.com/2th29femzz— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021