
‘మహానటి సావిత్రి, సహజనటి జయసుధ’ లాంటి గొప్ప నటీమణుల నటనను హావభావాలను చూసిన తెలుగు ప్రేక్షకులకు, ఇప్పటి హీరోయిన్లు ఇక ఏమి నచ్చుతారు. అందుకే మ్యాటర్ ఉన్న సాయిపల్లవి లాంటి ఒకరు ఇద్దరు హీరోయిన్లు ఫాలోయింగ్ లో అలాగే క్రేజ్ లో తమకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. మరి, పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ ను కూడా పలికించలేని ‘రాశి ఖన్నా’ లాంటి బబ్లీ బ్యూటీ పరిస్థితి ఏమిటి ? పేరు ఎలాగూ రాదు, కనీసం అవకాశాలు కూడా రాకపోతే.. అందుకే ఇలాంటి పరిస్థితులు తనకు రాకూడదు అని ‘రాశి ఖన్నా’ ఈ మధ్య ఒక విషయంలో చాల బ్లైండ్ గా ఫాలో అయిపోతుంది. తానూ గొప్ప నటిని కాకపోయినా.. మంచి అందగత్తెను.
కాబట్టి, ఎవరికీ ఉన్నది వారు దాన్ని వాడుకుంటూ పైకి రావాలి. నేను దాన్నే నమ్ముతాను, అందుకే ఇక నుండి ఎక్స్ పోజింగ్ లో ఎలాంటి కండీషన్స్ పెట్టుకోదల్చుకోలేదు. పాత్ర డిమాండ్ చేస్తే.. ఏమైనా చేయాలనుకోవడమే గ్లామర్ హీరోయిన్ సక్సెస్. ఇప్పుడు నేను కూడా దాన్నే ముందుకు తీసుకుపోదామనుకుంటున్నాను. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేయడానికి ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని దర్శకనిర్మాతలకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందట ఈ బ్యూటీ. ఏది ఏమైనా ‘రాశి ఖన్నా’ ఛాన్స్ లు తగ్గాయి అని ముందే గ్రహించి.. తన పంథాను మార్చుకుని.. మళ్ళీ వరుస అవకాశాలను అందుకుంటూ పోతుంది.
ఈ విషయాన్ని మిగిలిన ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలు కూడా అర్ధం చేసుకోవాలని.. సోషల్ మీడియాలో ఈ మధ్య రాశీ ఖన్నా ఎక్కువగా గ్లామరస్ ఫొటోలనే పోస్టు చేస్తూ.. మొత్తానికి తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరి పూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోతుంది. ఆ మధ్య అమ్మడు బికినీ ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లకు మంచి కిక్ ఇస్తూ తన అందచందాలతో కనువిందు చేసింది. దాంతో ఫిల్మ్ మేకర్స్ కూడా రాశీ ఖన్నా బోల్డ్ నెస్ ను చూసి షాక్ అయి.. ఛాన్స్ లు ఇస్తున్నారు. అయితే ఎంత చేసినా… పాపం స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది ఈ బబ్లీ బ్యూటీ. ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది.