Bigg boss : బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ మా లో 5 సిరీస్ లుగా తెలుగు టెలివిజన్ లో పెద్ద సంచలనం. ఈ అద్భుత సంచలనాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. ఓటీటీలో 24 గంటలు “బిగ్ బాస్” ని అందుబాటులోకి తెస్తోంది. ఈ బిగ్ బాస్ ఓటీటీ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

అయితే బిగ్ బాస్ ఓటీటీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి అభ్యంతరాలు తెలిపారు. ఈ షో అధికారిక వ్యభిచార గృహమని..భక్తి రస చిత్రాల్లో నటించిన నాగార్జున బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తాము ఈ షోకు వ్యతిరేకమని.. తమ పార్టీ ఆధ్వర్యంలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు నారాయణ తెలిపారు.

అయితే, నారాయణ కామెంట్స్ పై నాగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత నారాయణపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మండిపడింది. బిగ్ బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
కాగా బిగ్ బాస్ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు, ఉపాధి లభించిందని పేర్కొంది. ఒకవేళ షో నచ్చకపోతే ఛానెల్ మార్చుకోవాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నారాయణను తప్పుబట్టింది. మరి నారాయణను చెప్పుతో కొట్టాలంటూ తమన్నా సింహాద్రి చేసిన కామెంట్స్ పై నారాయణ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.