Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి కాంబోలో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. అనౌన్స్ తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ మూవీ.. లేటెస్ట్ గా విడుదల చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెంచేసింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవర్ స్టార్ యాక్షన్, రానా రియాక్షనతో .. భీమ్లానాయక్ గ్లింప్స్ దుమ్ము లేపాయనే చెప్పాలి. అయితే.. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోందని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పవన్ కు అభిమానులు ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారని చెబుతారు. మరి, అలాంటి ఫ్యాన్స్.. పవన్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఒప్పుకుంటారా? థియేటర్లో బొమ్మ పడాల్సిందే.. ఈలలు, గోలతో రచ్చ రచ్చ చేయాల్సిందే. అలాంటిది.. ఓటీటీలో సినిమా వచ్చేస్తోందని, దీనికి పవన్ కూడా ఓకే చెప్పేశాడనే వార్తలు మొదలయ్యాయి.
నిజానికి.. సంక్రాంతికి స్లాట్ బుక్ చేసిన యూనిట్.. జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది కూడా. దీంతో.. అటు సంక్రాంతి పందెం పుంజులు.. ఇటు పవన్-రానా యుద్ధం అదరహో అనిపించబోతున్నాయని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ.. భీమ్లానాయక్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని, ఓటీటీ చరిత్రలోనే ఇప్పటి వరకూ లేని డీల్ సెట్ అయ్యిందనే ప్రచారం సాగింది.
ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని జనవరి 12, 2022నాడు థియేటర్లో మాత్రమే విడుదల చేస్తాం.. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు. దీంతో.. ఓటీటీ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది.