
సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ ఇక లేడనే విషయం ఫిల్మ్ ఇండస్ట్రీ ని దిగ్ర్బాంతికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి మరణించారు. కర్టాటకలోని మైసూర్ లో జన్మించిన రాజన్, నరేంద్రతో కలిసి అనేక హిట్ సాంగ్స చేశారు. 1952లో విడుదలయిన ‘సౌభాగ్యలక్ష్మి’ చిత్రంతో సంగీత కెరీర్లో అడుగుపెట్టారు. ఆ తరువాత అగ్గిపిడుగు, పూజ, ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, కిలాడి దొంగలు వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.