
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత ఆంజనేయ పుష్పానంద్ అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం రాత్రి 11 గంటలకు చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. పుష్పానంద్ అనేక సినిమాలకు సినీ రచయితగా పనిచేశారు. 1987లో వచ్చిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’సినిమాకు కథ అందించిన పుష్పానంద్ లారీడ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాలకు పనిచేశారు. చివరిగా బాలక్రుష్ణ నటించిన ‘వీరభద్ర’ సినిమాకు కథ రాసిన ఆయన ఆ తరువాత మళ్లీ కథలు రాయలేదు. ఆ తరువాత సౌత్ ఇండియా ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్స్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.