
రింగ్‌తో డ్యాన్స్ చేయడమంటే మాములు విషయం కాదు. దానికి తగిన దుస్తులు ధరించి ఉండాలి. అందునా మహిళలకు కొంత ఇబ్బందే. అయితే డ్యాన్స్‌ర్ ఈష్ణ చీరకట్టి పెద్ద రింగ్‌తో ఓ హిందీ పాటకు స్టెప్పులు వేశారు. గెందాపూల్ అనే పాటకు ఆమె డ్యాన్స్ ఫర్మామెన్స్ చూపించడంతో నెటిజన్లు ఫుల్ సపోర్టు చేస్తున్నారు. గురువారం పోస్టు చేసిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఆమె ప్రతిభను వేల మంది అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.