
రానా కొత్త సినిమా విరాట పర్వం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ రానా అనారోగ్య కారణంగా తొలుత ఆగిన వెంటనే వచ్చిన కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. మళ్లీ ఎనిమిది నెలల తరువాత తిరిగి షూటింగ్‌ను పునరుద్దరించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా కూడా పర్రకటించారు. ఈ సినిమాలో రానా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్‌గా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తోంది. దానితో పాటుగా ఇది వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇప్పటికే దాదాపు ప్రత్యేక సన్నవేశాలను, మేజర్ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.