https://oktelugu.com/

CNG Car vs Petrol Car : పెట్రోల్ కారు కంటే CNG కారు ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

అయితే సీఎన్ జీ కార్లలో గ్యాస్ ట్యాంకులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే గ్యాస్ లీకేజీ అయి అవి పేలిపోయే ప్రమాదం ఉంది. పెట్రోల్ కార్లు రిపేరును ఎక్కడైనా చేస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2024 / 06:11 PM IST

    CNG Car vs Petrol Car

    Follow us on

    CNG Car vs Petrol Car : కారు కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు అంబాసిడర్ డీజిల్ కార్లు ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు CNG, ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువగా మొగ్గుచూపుతు్నారు. పెట్రోల్ కార్ల కంటే CNG కార్లు ఫ్యూయెల్ ఖర్చు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పెట్రోల్ కంటే సీఎన్ జీ తో నడిచే కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఈ క్రమంలో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి పెట్రోల్ కారు కంటే సీఎన్ జీ కారు ధర ఎక్కువగా ఎందుకు ఉంటుందో పరిశీలిద్దాం.

    పెట్రోల్ కార్లలోని ఫీచర్లు సీఎన్ జీలో దాదాపు సమానంగా ఉంటాయి. అయితే సీఎన్ జీ కార్ల కోసం ప్రత్యేకంగా గ్యాస్ నుంచి ఇంధనం రిలీజ్ అయ్యేవిధంగా అమరుస్తారు. ఈ కారులో సీఎన్ జీ ట్యాంకులు బలంగా సురక్షితంగా ఉండేలా భద్రతా చర్యలు తీసుకుంటారు. పెట్రోల్ కార్ల కంటే ఈ కార్ల మెయింటనెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటి సర్వీసింగ్, విడిభాగాల ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అలాగే సీఎన్ జీ కార్ల మరమ్మతుల కోసం నిపుణులు తక్కువగా ఉంటారు.

    పెట్రోల్ కార్ల కంటే సీఎన్ జీ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఇవి దీర్ఘకాలికంగా మెరుగైనవి అని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా సీఎన్ జీ కారు తయారు కావడానికి ఎక్కువ ఖర్చు అవసరం ఉంటుంది. దీంతో పెట్రోల్ కారు కంటే సీఎన్ జీ కారు ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో స్టోరేజీ ట్యాంక్, ఫిల్లింగ్ నాజిల్, ప్రెజర్ రెగ్యులేటర్ తదిత విభాగాలను అమర్చాల్సి ఉంటుంది. ఇవి తుప్పుపట్టకుండా ఏర్పాటు చేస్తారు. పెట్రోల్ కార్లలో ఇవి కనిపించవు.

    అయితే సీఎన్ జీ కార్లలో గ్యాస్ ట్యాంకులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే గ్యాస్ లీకేజీ అయి అవి పేలిపోయే ప్రమాదం ఉంది. పెట్రోల్ కార్లు రిపేరును ఎక్కడైనా చేస్తారు. కానీ సీఎన్ జీ కార్లను మాత్రం ఎంపిక చేసిన షోరూంలో మాత్రమే నిర్వహిస్తారు. మైలేజ్ కోరుకునేవారు సీఎన్ జీ కారును కొనుగోలు చేయొచ్చు. కానీ ధర మాత్రం పెట్రోల్ కారు కంటే రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఎక్కువ చెల్లించాలి.