White Car: తెలుపు రంగు ప్రశాంతతకి సంబంధించినది. చాలా మంది ఈ రంగుకి ఇష్టపడతారు. వేసుకునే దుస్తులు నుంచి కార్ల వరకు అన్ని కూడా వైట్ కలర్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రంగు చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రంగుకి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే మంచిది. ఎందుకంటే వైట్ కలర్‌లో ఉన్న ఏ వస్తువు అయిన కూడా తొందరగా మురికి పడుతుంది. దీంతో ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. అయితే జీవితంలో కారు తీసుకోవాలని అందులో ప్రయాణించాలని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలో సెంటిమెంట్‌గా భావించి వైట్ కలర్‌లో ఉండే కారును తీసుకోవడానికి ఇష్టపడతారు. చూడటానికి వైట్ కలర్ కారు బానే ఉంటుంది. కానీ దీనివల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు వైట్ కలర్ కారు కొనాలనుకుంటే మాత్రం.. ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకున్న తర్వాతే కొనడం మంచిది. మరి వైట్ కలర్ కారు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం.
వైట్ కలర్ కారు చూడటానికి బాగుంటుంది. కానీ తొందరగా నల్లగా మారుతుంది. ఒక్కసారి రోడ్డు మీదకు వెళ్తే చాలు నల్లగా అవుతుంది. దీనివల్ల కారు అందం పోతుంది. అలాగే ఎక్కువ సార్లు కారును కడగవలసి వస్తుంది. వైట్ కలర్‌ను సెంటిమెంట్‌గా భావించి చాలా మంది వైట్ కలర్ కారును ఎక్కువగా కొంటారు. దీనివల్ల వైట్ కలర్ కార్లు ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తుంటాయి. దీనివల్ల మీ కారు యూనిక్‌గా అనిపించదు. అందరిలానే మీ కారు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, రెంట్‌కి తీసుకున్న వారు కూడా ఎక్కువగా వైట్ కలర్ కారును వాడుతుంటారు. కాబట్టి మీ కారు ఇందులోనే కలిసిపోతుంది. అదే వేరే రంగు కారు అయితే ఒక ఐడెంటిటీ ఉంటుంది. అలాగే కార్లకు ఎక్కువగా ఎండ పడితే తెలుపు రంగు కాస్త మారిపోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా తెల్ల కారులు పొగమంచులో కనిపించవు. దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి.
సాధారణంగా కూడా లైటింగ్స్‌లో వైట్ కార్లు పెద్దగా కనిపించవు. వీటివల్ల ప్రాణ నష్టం ఏర్పడుతుంది. సెంటిమెంట్ ఉండటం ముఖ్యమే. అలాగే సేఫ్టీ కూడా చూసుకోవాలి. కేవలం మన ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎంత జాగ్రత్తగా వాడిన కూడా కొన్నిసార్లు వైట్ కలర్ కారు నల్లగా మారుతుంది. అందులోనూ వర్షా కాలం అయితే చెప్పక్కర్లేదు. వేరే రంగు కార్లు బురదలో వెళ్తేనే కారు మొత్తం ఇక నల్లగా అవుతుంది. అలాంటిది వైట్ కలర్ కారు కాస్త బురదతో మారుతుంది. అలాగే తెలుపు రంగు అయితే ఎక్కువ సార్లు కారు వాష్ చేయాలి. ఒకవేళ కారుకి పూర్తిగా సర్వీసింగ్ చేయించకపోతే రంగు కూడా పూర్తిగా మారిపోతుంది.