EMI : నేటి కాలంలో Job దొరకడం చాలా కష్టంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో కొన్ని కంపెనీలు నష్టాల బాటలో వెళ్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు మూతపడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం ఊడిన వారి పరిస్థితి ధీనంగా మారుతుంది. ముఖ్యంగా EMIలు ఉన్న వారి పరిస్థితి ఆందోళనగా ఉంటుంది. చాలా మంది ఉద్యోగం రాగానే రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందరు బ్యాంకు లోన్లు తీసుకొని ఈఎంఐలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ జాబ్ పోగానే వీటిని కట్టడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి నాలుగు లేదా ఐదు నెలల పాటు ఈఎంఐ చెల్లించే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?
ఉద్యోగం ఒకరి కింద చేసే పని. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. అందువల్ల ఉన్న ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. అంతేకాకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అన్నట్లుగా ఆదాయం వస్తున్నంత సేపు ఖర్చులు పెట్టకుండా పొదుపు చేసుకోవాలి. అయితే చాలా మంది జాబ్ పోతుందని ఊహించరు. కానీ దురదృష్టవశాత్తూ ఒక్కోసారి ఊడిపోతుంది. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా ఈఎంఐల నుంచి వచ్చే ఫోర్స్ ను తట్టుకోవాలి.
చాలా బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో ఉన్న విలువ.. ఈఎంఐలు మిస్ చేస్తే ఇవ్వరు. కొన్ని నెలల పాటు ఈఎంఐలు కట్టకపోతే ఇంటికి వచ్చి మరీ వసూలు చేయడానికి రెడీ అవుతారు. అయితే కొన్నిసార్లు వీరు లోన్ తీసుకున్న వారిపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి.అయితే ఈ సమయంలో ఈఎంఐలు ఎలాగైనా తీరుస్తామనే భరోసా వచ్చినట్లయితే అప్పుడు ఓ చిన్న పనిచేయాలి. రికవరీ ఏజెంట్ల బాధ నుంచి తప్పించుకోవడానికి నేరుగా బ్యాంకుకు వెళ్లాలి. బ్యాంకు అధికారితో మాట్లాడి నెల వరకు గడువు ఇవ్వమని కోరాలి. సమస్య జెన్యూ అయితే ఎవరైనా ఒప్పుకునే అవకాశం ఉంది. అయితే గడువు ఇచ్చిన సమయంలోగా బ్యాంకుకు ఈఎంఐ చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రికవరీ ఏజెంట్ల బాధ నుంచి తప్పించుకోవచ్చు.
మరో విషయం ఏంటంటే రికవరీ ఏజెంట్లు సైతం సమయపాలన లేకుండా డబ్బు వసూలు చేయడానికి అవకాశం లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే బ్యాంకు ఈఎంఐ గురించి మాట్లాడరాదని ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన HDFC బ్యాంకుకు ఆర్బీఐ రూ. కోటికి పైగా జరిమానా విధించింది. మరో బ్యాంకుకు రూ.2.5 కోట్ల ఫెనాల్టీ వేసింది. అందువల్ల రాత్రి సమయంలో ఎవరైనా డబ్బు రికవరీ గురించి మాట్లాడితే వెంటనే ఆర్బీఐకి కంప్లయింట్ చేయొచ్చు.
కానీ ఈలోగా ఈఎంఐ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. లేదా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆర్థికంగా భారం ఏర్పడి జీవితంపై ప్రభావం ఏర్పడుతుంది. దీంతో భవిష్యత్ లో ఎలాంటి లోన్ తీసుకుందామనుకున్నా.. అవకాశం ఉండదు. మరోవైపు రికవరీ ఏజెంట్లు పదే పదే ఇంటికి రావడం వల్ల సమాజంలో గుర్తింపును కోల్పోతారు.