Budget Car: దేశంలో కార్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. అందుకు తగినట్లుగానే మార్కెట్ లోకి సైతం రకరకాల ఫీచర్లతో కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే సామాన్య ప్రజలు కొందరు కారును కొనుగోలు చేయాలంటే తమ బడ్జెట్ లో వస్తుందో..? రాదో..? అని భయపడుతున్నారు. కానీ అతి తక్కువ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి.
మన భారతదేశంలో రూ.5 లక్షల బడ్జెట్ లోనే మంచి కార్లు అందుబాటులోకి వచ్చాయి.. అవి ఏంటో మనం ఒకసారి చూసేద్దాం రండి.
ఇందులో ముందుగా మారుతి ఆల్టో కె10..సామాన్య ప్రజల బడ్జెట్ లో ఉండే కారు. దీని ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్న ఈ కారు 65.7 బీహెచ్పీ పవర్, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అంతేకాదు ఆయా వేరియంట్లను అనుసరించి మైలేజ్ 24.39 kmpl నుంచి 33.85 km/kg ఉంటుంది.
తరువాత మారుతి ఆల్టో.. సుమారు ఐదు వేరియంట్లలో నాలుగు కలర్స్ లో లభిస్తుంది. మార్కెట్ లో మారుతి ఆల్టో కారు ధర రూ.3.54 లక్షల నుంచి రూ.5.13 లక్షల వరకు ఉంటుంది. 796 సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండే ఈ కారులో సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఆయా వేరియంట్లను అనుసరించి కారు మైలేజ్ 22.05 kmpl – 31.59 km/kg వరకు ఉంటుంది.
అలాగే రెనో క్విడ్ హ్యాచ్ బ్యాక్.. ఈ కారు ధర మార్కెట్ లో రూ. 4.69 లక్షల నుంచి రూ.6.44 లక్షల వరకు ఉంటుంది. ఒక లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉండగా ఈ కారు మైలైజ్ 21.46 kmpl – 22.3 kmpl ఉంటుంది. ఈ కారు కూడా సుమారు 11 వేరియంట్లలో ఏడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
తరువాత మారుతి ఎస్ – ప్రెస్సో.. ఈ కారు మార్కెట్ లో రూ.4.26 నుంచి రూ.6.11 లక్షల వరకు ధర పలుకుతోంది. ఒక లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు సీఎన్జీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 24.02 kmpl, సీఎన్జీ వేరియంట్ 32.73km/kg గా ఉంది. మారుతి ఎస్ -ప్రెస్సో సుమారు ఎనిమిది వేరియంట్లలో ఏడు రంగుల్లో అందుబాటులో ఉంది.
బజాజ్ క్యూట్ ..ఈ కారు ధర మార్కెట్ లో సుమారు రూ. 3.60 లక్షలుగా ఉంది. 216 సీసీ సామర్థ్యంతో కూడిన ఇంజన్ కలిగి ఉన్న కారు సీఎన్జీ హ్యాచ్ బ్యాక్ 5500 rpm వద్ద 10.8 bhp పవర్ జనరేట్ చేస్తుంది. అలాగే దీని బూట్ స్పేస్ 20 లీటర్లు. ఈ కారు కూడా సుమారు మూడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.