Homeబిజినెస్Vivo X300 Ultra Camera Features: ఫొటోగ్రాఫర్లు పాత కెమెరాను తీసేసి ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.....

Vivo X300 Ultra Camera Features: ఫొటోగ్రాఫర్లు పాత కెమెరాను తీసేసి ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.. ధర ఎంతంటే..

Vivo X300 Ultra Camera Features: స్మార్ట్‌ఫోన్ కొనే చాలా మంది ఇందులో ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ విషయంలో శ్రద్ధ చూపుతున్నారు. ఈ ఆప్షన్లు బాగుంటేనే మొబైల్ కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు కెమెరా ప్రత్యేకతను కలిగి ఉన్న డివైజ్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వీటిలో Vivo కంపెనీకి ఓ కొత్త ఫోన్ ఆకర్షిస్తోంది. ఆ ఫోన్ గురించి వివరాల్లోకి వెళితె..

Vivo కంపెనీ నుంచి X300 Ultra అనే మొబైల్ లో కెమెరా ప్రధాన ఆకర్షణ ఉంటోంది. ఇందులో ZEISS భాగస్వామ్యంతో రూపొందించిన మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ , 200MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరాలు రంగులు, డీటెయిలింగ్‌లో అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా దీని టెలిఫోటో జూమ్ , అదనపు టెలి-ఎక్స్‌టెండర్ యాక్సెసరీలను ఉపయోగించినప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల అద్భుతమైనAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో ఉండే ఇందులో గేమింగ్ ఆడితే చాలా స్మూత్‌గా ఉంటుంది. గరిష్టంగా 4500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండటం వల్ల, ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుండి రక్షణను కలిగి ఉంటుంది.

X300 Ultra అనే మొబైల్ లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనివల్ల మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్చ వీడియో ఎడిటింగ్ వంటి పనులు ఎటువంటి లాగ్ లేకుండా జరుగుతాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది. వివో సంస్థ దీనికి ఐదేళ్ల మేజర్ ఓఎస్ అప్‌డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇందులో 6600mAh బ్యాటరీని అమర్చారు. ఇది రోజంతా ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ చేసినా కూడా ఎక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఈ బ్యాటరీకి 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది, ఇది ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.1,59,999 నుండి ప్రారంభమవుతుంది. మీరు మీ పాత డిజిటల్ కెమెరాకు ప్రత్యామ్నాయంగా ఒక స్మార్ట్‌ఫోన్‌ను వెతుకుతున్నట్లయితే, ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎంపికలలో ఒకటి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular