Homeబిజినెస్Virtual Debit Card: సైబర్ మోసాలకు ‘వర్చవల్ డెబిట్ కార్డు’తో చెక్.. అసలేంటిది..

Virtual Debit Card: సైబర్ మోసాలకు ‘వర్చవల్ డెబిట్ కార్డు’తో చెక్.. అసలేంటిది..

Virtual Debit Card: ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే వీటితో పాటు సైబర్ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫేక్ వెబ్‌సైట్లు, డేటా చోరీ, కార్డు క్లోనింగ్ వంటి మోసాల కారణంగా చాలా మంది తమ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు బ్యాంకులు అందిస్తున్న వర్చువల్ డెబిట్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా మారాయి. అసలు వర్చువల్ డెబిట్ కార్డు అంటే ఏమిటీ?

వర్చువల్ డెబిట్ కార్డ్:
వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే కార్డు. దీనికి కూడా సాధారణ డెబిట్ కార్డు మాదిరిగానే 16 అంకెల కార్డు నంబర్, గడువు తేదీ , CVV నంబర్ ఉంటాయి. అయితే ఇది భౌతిక కార్డు కాదు. మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవసరమైనప్పుడు సృష్టించుకుని ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించవచ్చు.

సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో మన అసలు డెబిట్ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వెబ్‌సైట్ భద్రంగా లేకపోతే కార్డు సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉంటుంది. కానీ వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తే అసలు కార్డు నంబర్‌ను ఎక్కడా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రధాన బ్యాంకు ఖాతా వివరాలు మరింత సురక్షితంగా ఉంటాయి.

దొంగల నుంచి రక్షణ:
వర్చువల్ కార్డుల ప్రధాన ప్రయోజనం భద్రత. చాలాసార్లు ఈ కార్డులకు పరిమిత కాలపరిమితి లేదా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే సదుపాయం ఉంటుంది. లావాదేవీ పూర్తయ్యాక కార్డు పనిచేయకపోవడం వల్ల సమాచారం లీక్ అయినా దుర్వినియోగం చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో సైబర్ మోసగాళ్లు కార్డు వివరాలను పొందినా బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని దోచుకోవడం కష్టమవుతుంది.

వర్చువల్ డెబిట్ కార్డులో మరో ప్రత్యేకత ఏమిటంటే ఖర్చు పరిమితిని వినియోగదారుడే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రూ.1,000 విలువైన వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే అదే మొత్తానికి కార్డును సెట్ చేయవచ్చు. దీంతో ఆ మొత్తానికి మించి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఖాతాలో లక్షల రూపాయలు ఉన్నా, కార్డులో నిర్ణయించిన పరిమితి మాత్రమే ఉపయోగించబడుతుంది.

ఈ కార్డు పొందడం ఎలా?
చాలా బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డు సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత ‘Virtual Debit Card’, ‘Generate Card’లేదా ఇలాంటి ఆప్షన్‌ను ఎంచుకుని కార్డును సృష్టించుకోవచ్చు. కొన్ని సెకన్లలోనే కొత్త కార్డు నంబర్, CVV, గడువు తేదీ జనరేట్ అవుతాయి. వెంటనే వాటిని ఉపయోగించి ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version