Maruti Suzuki Invicto: దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటోంది మారుతి సుజుకి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజైన మోడళ్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చి మల్టీ పర్పస్ వెహికిల్స్ (ఎంవీపీఎస్) ఎర్టిగా, ఎక్స్ ఎల్ 6 వినియోగదారులను ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు మరో ఎంవీపీఎస్ ను రోడ్లపై తిప్పనుంది. దీనికి ఇన్ విక్టో అని నామకరణం చేసి ఇప్పటికే పరిచయం చేసింది. ఈ మోడల్ ను జూన్ 19 నుంచి ఆన్ లైన్ బుకింగ్ కు అవకాశం ఇవ్వనుంది. అయితే దీని గురించి తెలుసుకుందాం.
టాయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఇదే మోడల్ లో మారుతి ఇన్ విక్టాను కూడా తయారు చేస్తున్నారు. కిర్లోస్కర్ మోటార్స్, మారుతి సుజుకిల మధ్య ఏర్పడిన ఒప్పందంలో భాగంగా నాలుగో మోడల్ ను రిలీజ్ చేస్తున్నారు. అంతకుముందు టయోటా గ్లాన్జా, విటారా బ్రెజా, టయోటా అర్బన్ క్రూయిజర్ లు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు టయోటా ఇన్నోవా లోని ఇంజన్ నే పోలి ఉండే ఇన్ విక్టా ఉంటుందని అంటున్నారు.
మారుతి సుజుకి ఇన్ విక్టా జూన్ 19 నుంచి బుకిట్ ఓపెన్ కానున్నాయి. జూలై 5న దీనిని మార్కెట్లోకి తెస్తున్నారు. మార్కెట్లో దీని ధర రూ. 18 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు మారుతి నుంచి వచ్చిన ఎక్స్ ఎల్ ప్రీమియం ఆప్షన్ గా ఎంపికైంది. దీనికి తరువాయి అన్నట్లుగా ఇన్ విక్టా ఆకర్షించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
ఆన్లైన్లో ఉంచిన వివరాల ప్రకారం మారుతి సుజుకి ఇన్ విక్టా ఫీచర్స్ విషయానికొస్తే.. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. గరిష్టంగా 174 పీఎస్ విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అలాగే 205 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సెల్ఫ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 186 పీఎస్ విద్యుత్, 188 ఎన్ ఎం ఇంజిన్ టార్చి, 206 ఎన్ ఎం మోటార్ టార్చి ఉంది. అయితే పూర్తి వివరాలు మార్కెట్లోకి జూన్ 19 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.