కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు అవసరం కానున్నాయి. గ్యాస్ ఏజెన్సీలపై భారం పెరుగుతుండటంతో కొత్త గ్యాస్ ఏజెన్సీలు కూడా అవసరమవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకోవాలంటే కచ్చితంగా భారతీయుడై ఉండాలి. కానీసం 10వ తరగతి పాసైన వాళ్లు మాత్రమే ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే గ్యాస్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో కుటుంబ సభ్యులు ఎవరూ పని చేయకూడదు. గ్యాస్ సిలిండర్‌ల నిల్వ కోసం పెద్ద గోడౌన్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. దేశంలో ప్రస్తుతం మూడు ప్రభుత్వ ఎల్‌పీజీ కంపెనీలు ఉన్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
https://www.lpgvitarakchayan.in/index.php ద్వారా గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. కంపెనీ స్టాండర్డ్ ప్రకారం డిపాజిట్ మొత్తం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే గ్యాస్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.