Best Cars: మీరు త్వరలో ఒక ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీ బడ్జెట్ రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉందా.. అయితే మీరు క్రెటా కారు కొనాలని భావిస్తున్నారు. మీ బడ్జెట్‌లో వస్తున్న మిడ్ జైస్ ఎస్‌యూవీ క్రెటా.. ఎక్కువ మంది దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో మరికొన్ని ఎస్‌యూవీలు మార్టెలోకి వచ్చాయి. ఈ కార్లలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌తోపాటు శక్తివంతమైన ఇంజిన్ ఉన్నాయి. మీ బడ్జెట్‌లో కొనుగోలు చేయాల్సిన, ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న కార్ల గురించి తెలుసుకుందాం.
స్కోడా కుషాక్..
దీని ధర రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గర్షి›్టంగా రూ.20 లక్షల వరకు ఉంది. స్కోడా కుషాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నాయి. దీని 1.0 ఎల్ టర్బో పెట్రోల్ ఇంజన్ 6–స్పీడ్ ఎంటీ, 6–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వర్షన్‌లో అందుబాటులోఉంది. స్కోడా కుషాక్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో కంపెనీ ఎస్‌యూవీ ఇంధన ట్యాంక్ 50 లీటర్ల సామర్థ్యం, బూస్ట్ స్పేస్ 385 లీటర్లు. ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 188 ఎంఎం. కుషాక్ బేస్ మోడల్ ఫ్రంట్ పవర్ విండోస్, డే–నైట్ ఐఆర్‌వీఎం అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్‌రె7స్ట్, పవర్ స్టీరింగ్, మల్టీ కొలిజన్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వోక్స్ వ్యాగన్ టైగన్..
దీని ధర రూ. 11.62 లక్షల నుంచి రూ.19.36 లక్షల వరకు ఉన్నాయి. స్కోడా కుషాక్‌లాగా ఇది కూడా 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అదే గేర్ బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. టైగన్, కంఫర్ట్ లైన్, హై లైన్, టాప్ లైన్, టాప్ లైన్ సౌండ్ ఎడిషన్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఓఆర్‌వీఎంలు, ఫాలో మీ హోమ్ లైట్లు, ఐఎస్‌వో ఎఫ్‌ఐఎక్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్/స్టోరేజ్, హాలోజన్∙హెడ్‌ల్యాంప్‌లు, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ అవుట్‌లెట్ ప్రారంభం వంటి ఫీచర్లు దాని బేస్ మోడల్ నుంచి అందుబాటులో ఉన్నాయి. లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
ఎంజీ ఆస్టర్..
దీని ధర రూ.10.82 లక్షల నుంచి రూ.18.69 లక్షల వరకు ఉంది. ఈ ఐదు సీట్ల కారు 1.3 లీటర్ టర్బో–పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ నేచురల్–ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌లో లభిస్తుంది. ఎంజీ ఆస్టర్ ఫీచర్లలో 10–అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6–వే పవర్–అడ్జస్ట్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్ ఉన్నాయి. ఈ కారు అడ్వాన్స్‌డ్ డ్రైవ్ అసిస్టెన్స్ సిస్టమ్ అంటే ఏడీఏఎస్ ఫీచర్‌తో కూడా వస్తుంది. 5 మంది కూర్చునే సామర్థ్యంతో, ఈ ఎస్‌యూవీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా కలిగి ఉంది.