2024 SUV cars : కళ్లు చెదిరే ఫీచర్స్.. ఆకట్టుకునే డిజైన్.. 2024లో రాబోయే ఈ SUVల గురించి తెలుసుకోవాలని ఉందా?

మహీంద్రా కంపెనీ పైన తెలిపిన కారు తో పాటు ఇప్పటి కే రిలీజ్ చేసిన థార్ ను అప్డేట్ తో తీసుకవస్తోంది. ఇది 2024 జూన్ లో అందుబాటులోకి రావొచ్చు. 5 డోర్ కలిగిన ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ కారు రూ.16 లక్షల (ఎక్స్ షో రూం) నుంచి విక్రయించనున్నారు.

Written By: NARESH, Updated On : March 9, 2024 12:22 pm

These are the features of these SUV cars coming in 2024

Follow us on

2024 SUV cars : ప్రస్తుత కాలంలో SUV లకు ప్రాధాన్యత పెరుగుతోంది. హ్యాచ్ బ్యాక్ కార్ల నుంచి చాలా మంది ఎస్ యూవీల వైపు మళ్లుతున్నారు. బాహుబలి లాంటి ఇంజిన్లు.. విశాలమైన స్సేసెస్ ఉన్న ఈ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా SUVల ఉత్పత్తిపైనే ఫోకస్ పెట్టాయి. మహీంద్రా నుంచి టాటా కంపెనీ వరకు ఇప్పటి వరకు ఉన్న కొన్ని మోడళ్లను అప్డేట్ చేస్తుండగా.. కొన్ని కొత్త మోడళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి కొత్తగా వచ్చే ఎస్ యూవీ కార్లేవో తెలుసుకుందామా..

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అనగానే SUV ల బ్రాండ్ అని చాలా మంది పిక్స్ అయిపోతారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ తీసుకొచ్చిన ఎస్ యూవీలు హిట్ అయ్యాయి.ఆ ఊపుతో ఇప్పుడు కొత్తగా XUV 300 ఫేస్ లిప్ట్ ను మరి కొద్ది నెలల్ల మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ తో పాటు 117 బీహెచ్ పీ పవర్ ఉండనుంది. ఇన్నర్ క్యాబిన్ ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు విక్రయించనున్నారు.

హ్యాుందాయ్ నుంచి కొత్తగా అల్కాజార్ అనే మోడల్ 2024లో మార్కెట్లోకి రాబోతుంది. ఇది పెట్రోల్ తో పాటు డీజిల్ వేరియంట్లలోనూ అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగిన ఇందులో రీ డిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాను పొందవచ్చు. అలాగే ఎల్ ఈడీ, డీఆర్ఎ ల్ ను అప్డేట్ చేశారు. దీనిని రూ.17 లక్షలతో విక్రయించనున్నారు. ఎంజీ కంపెనీ నుంచి కొత్త ఏడాదిలో గ్లోస్టర్ ఫేస్ లిప్ట్ ను మార్కెట్లోకి తీసుకు వస్తోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ నుఅమర్చారు. దీని ధర రూ.40 లక్షల నుంచి మొదలవుతుంది.

మహీంద్రా కంపెనీ పైన తెలిపిన కారు తో పాటు ఇప్పటి కే రిలీజ్ చేసిన థార్ ను అప్డేట్ తో తీసుకవస్తోంది. ఇది 2024 జూన్ లో అందుబాటులోకి రావొచ్చు. 5 డోర్ కలిగిన ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ కారు రూ.16 లక్షల (ఎక్స్ షో రూం) నుంచి విక్రయించనున్నారు. ఇక టాటా మోటార్స్ సైతం కొత్త ఏడాదిలో SUVని తీసుకొస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, ఆల్ ఎల్ ఈడీ లైటింగ్ ఆకర్షిస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. దీనిని రూ.14 నుంచి రూ.20 లక్షల వరకు విక్రయించనున్నారు.