Bank: లో ఈ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే?

చాలా మంది ప్రతిరోజూ నగదు వ్యవహారాలను బ్యాంకు ద్వారా జరుపుతూ ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు సాగించేందుకు ప్రస్తుత కాలంలో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ మాద్యమాల ద్వారా నగదు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మొబైల్, ఇతర ఇంటర్నెట్ సాధనాల ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు

Written By: Srinivas, Updated On : October 30, 2024 11:26 am

Bank

Follow us on

Bank: చాలా మంది ప్రతిరోజూ నగదు వ్యవహారాలను బ్యాంకు ద్వారా జరుపుతూ ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు సాగించేందుకు ప్రస్తుత కాలంలో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ మాద్యమాల ద్వారా నగదు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మొబైల్, ఇతర ఇంటర్నెట్ సాధనాల ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. కొన్ని బ్యాంకుకు సంబంధించిన పనులు కూడా ఇప్పుడు మొబైల్ ద్వారానే చేసుకునే సౌకర్యాలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల బ్యాంకు అకౌంట్ కు సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోతుంటాయి. వీటిని చాలా రోజుల వరకు పట్టించుకోకపోవడం వల్ల ఇవి Inoperative కింద పడుతాయి. ఈ సమయంలో బ్యాంకు వారు ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఈ సమయంలో ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఎందుకంటే?

ప్రస్తుత కాలంలో బ్యాంకుతో వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక అవసరంతో బ్యాంకుతో పని ఉంటుంది. ఇప్పుడు వాడుతున్న మొబైల్ యాప్ లు కూడా బ్యాంకులతో లింకై ఉంటాయి. ఎవరికైనా మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే బ్యాంకు ద్వారానే పంపించాల్సి ఉంటుంది. అలాగే కొందరికి ఒకటికి మించి బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఉద్యోగాలు మారుతుండడంతో పాటు వివిధ అవసరాల నేపథ్యంలో అనేక బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకు అకౌంట్ల గురించి పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకు అకౌంట్లు వాడకపోవడం వల్ల అవి Inoperative గా మారుతాయి. అంటే ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక వ్యవహారాలు జరపకపోవడం వల్ల అవి Silentలో పడిపోతాయి. ఇటువంటి సమయంలో ఈ బ్యాంకు ఖాతాలో మనీ ట్రాన్జాక్షన్ జరపలేం. ఒకవేళ చాలా వరకు వాడని బ్యాంకు అకౌంటో లో డబ్బులు వేసే సమయంలో బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఇది Inoperative గా మారితే వారి ద్వారా వీటిని Active చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని బ్యాంకులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. కానీ ఈ సమయంలో వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రూల్స్ ప్రకారం బ్యాంకు కు సంబంధించిన ఏ వ్యవహారమైనా బ్యాంకు అధికారులే ఉచితంగా చేయాలి. ముఖ్యంగా బ్యాంకు ఖాతా Inoperative గా మారితే యాక్టివ్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయొద్దు. ఒకవేళ బ్యాంకు అధికారులు ఛార్జీల విషయంలో ఒత్తిడి చేస్తూ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అంతేగాని బ్యాంకు అధికారులు ఛార్జీలు వేసే అధికారం లేదు. అయితే ప్రస్తుత కాలంలో వ్యక్తులకు ఒకటికి మించి బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అవసరం లేని కొన్ని ఖాతానుల క్లోజ్ చేసుకోవడం మంచిది. Inoperative ఛార్జీల నుంచి తప్పించు కోవచ్చు. కానీ In Balance, Annual Charges మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.అందువల్ల ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు బ్యాంకు అకౌంట్స్ చెక్ చేసుకొని మనీ ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది.