Maruthi Celerio : కారులో ప్రయాణించడం అందరికీ సరదా నే. సొంత కారం ఉంటే ఎక్కడికైనా వెళ్లాలని అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజుల్లో సొంతంగా వెహికల్ ఉండాలని చాలామంది కోరుకొని కొనుకుంటున్నారు. అయితే కారులో వెళ్ళడం వల్ల ఎంత హాయిగా ఉంటుందో ఒక్కోసారి ప్రమాదాలు జరిగితే ఎంత కంటే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరగడానికి డ్రైవింగ్ సరిగ్గా లేకపోవడం ఒక కారణం అయితే.. కారు సేఫ్టీగా లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందే కారు Safety దా? కాదా? అని చాలామంది చూసుకుంటారు. కొందరు కారులో ఫీచర్స్ ధర చూస్తే మరికొందరు ప్రత్యేకంగా ఈ కారు ఎంతవరకు భద్రం ? అని చూస్తారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా సేఫ్టీ ఫీచర్లను జోడిస్తూ మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. అయితే మారుతి కంపెనీకి చెందిన ఓ కారు బెస్ట్ సేఫ్టీ కారుగా పేర్కొంటుంది. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న లేటెస్ట్గా దీని సేఫ్టీ ఫీచర్లను అప్డేట్ చేసి మరీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇంతకీ ఈ కారు ఏది? ఆ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్లు ఏంటి?
దేశంలో మారుతి కంపెనీకి చెందిన అనేక కార్లు బెస్ట్ అని అనిపించుకుంటాయి. ఇవి ఎక్కువగా మిడిల్ క్లాస్ కు దగ్గరగా ఉండి లో బడ్జెట్లో మార్కెట్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే వీటిలో కొన్ని కార్లు సేఫ్టీ కాదని తెలిశాయి. కానీ ఇటీవల రిలీజ్ చేసిన ఓ కారు బెస్ట్ సేఫ్టీగా పేర్కొంటుంది. ఈ కారులో ప్రయాణం చాలా భద్రం అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకీ అది ఏ కారు కాదు సెలెరియో.
Maruthi Celerio కారు గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ కారు అప్డేట్ చేసుకొని ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ముఖ్యంగా సేఫ్టీ ఫీచర్లను ఎక్కువగా చేర్చారు. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్ ను అమర్చారు. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన ABS హిల్ ఓల్డ్ అసిస్టు, వంటివి ఆధారంగా చేర్చారు. దీంతో మిగతా కార్ల కంటే ఇది బెస్ట్ సేఫ్టీ అని కొందరు అంటున్నారు.
మారుతి సెలెరియో హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో వచ్చి అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు సేఫ్టీలో బెస్ట్ కారు అని చెప్పడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.34 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మొత్తం నాలుగు వేలు ఇంట్లో అందుబాటులో ఉన్న ఈ కారు 1.0 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సేఫ్టీ మాత్రమే కాకుండా ఈ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి.