Virani Brothers : జీవితంలో పైకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎన్నో అవాంతరాలు.. ఎన్నో అడ్డంకులు.. కానీ లక్ష్యాన్ని ఛేదించాలని కొందరు పట్టుబడుతారు. వారు చిన్న స్థాయిలో ఉన్నా.. తీవ్రంగా శ్రమించి అత్యున్నతస్థాయికి ఎదుగుతారు. భారత్ తో ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. కానీ విరానీ సోదరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సినిమా హాళ్లలో సాధారణ స్నాక్స్ అమ్ముకునే స్థాయి నుంచి పెద్ద కంపెనీలకు ఓనర్లు అయిన వీరి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. నేటి యువకులకు వీరి జీవితం ఆదర్శంగా చెప్పుకోవచ్చు.. విరానీ సోదరుల కథ లోకి వెళితే..
భారత్ లోని ప్రముఖ కంపెనీల్లో బాలాజీ వేపర్స్ ప్రత్యేకమైంది. స్నాక్స్ వ్యాపారంలో దిగ్గజంగా ఉన్న ఈ కంపెనీ ఓనర్స్ విరానీ సోదరులు. ఒకప్పుడు వీరు సినిమా హాళ్లలో స్నాక్స్ ను విక్రయించేవారు. నెలకు 1000 రూపాయల జీతం తీసుకునేవారు. అయితే అందరిలాగా వారు నెలనెలా జీతం తీసుకుంటూ పోతే వారి జీవితం అక్కడే ఆగపోయేది. కానీ ఓ కంపెనీ స్థాపించి, దానికి ఓనర్లు కావాలన్న తపన వారిలో ఉండేది. దీంతో వారు కొత్ ప్రయత్నాన్ని మొదలు పెట్టారు.
ఈ తరుణంలో విరానీ సోదరుల్లో ఒకరైన సందుభాయ్ విరానీ 1974లో తన సోదరుడితో కలిసి పొటాటో చిప్స్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. తొలుత వీరు చిన్న స్థాయిలో చిప్స్ తయారు చేసి చుట్టుపక్కల దుకాణాల్లో విక్రయించేవారు. ఆ తరువాత 1982లో రూ.1.5 లక్షల రుణం తీసుకొని ఆలు చిప్స్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు.
కానీ 1992లో వీరు బాలాజీ వేపర్స్ పేరిట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. అలా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వీరి కంపెనీ ఆ తరువాత అనతి కాలంలోనే ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వీరి కంపెనీ మార్కెట్లో 12 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో వీరు అమెరికాకు చెందని పెప్సికో ను సొంతం చేసుకోవాలని యత్నించారు. ఇక గత ఏడాది ఈ కంపెనీ ఆదాయం రూ.5,000 కోట్లకు చేరుకుంది. ప్సత్తుం ఇందులో 7000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.