Tata Punch New Version: దేశీయ అతిపెదా మోమటార్ సంస్థ 2026 వాహన శ్రేణులను ప్రారంభంలోనే అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే టాటా వాహనాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దానిని మరింత పెంచుకునే క్రమంలో కొత్త వాహనాలను లాంచ్ చేస్తోతంది. తాజాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మంగళవారం(జనవరి 13న) కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ఆకర్షణీయ ఫీచర్లు, పోటీ ధరతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో నెలవారీ 40 వేల యూనిట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి వచ్చింది.
అధునాతన ఇంజిన్, సేఫ్టీ ఫీచర్లు
1.2–లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో సజ్జం చేసిన ఈ ఎస్‌యూవీ శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. 360–డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రీమియం సురక్షిత డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. మొత్తం 6 వేరియెంట్లలో అందుబాటులోకి వస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్, స్కోడా కైలాక్ వంటి మోడల్స్‌తో ఈ కొత్త పంచ్ డైరెక్ట్ పోటీకి దిగుతుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ధరతో పాటు ఫీచర్ల సమతుల్యత దీని బలం. ఈ శ్రేణి వాహనాల విక్రయాలు ఎక్కువ కావడం టాటాకు అవకాశాలను పెంచుతున్నాయి.
ధరల వివరాలు..
ప్రారంభ ధర రూ.5.59 లక్షలతో మొదలై, టాప్ వేరియెంట్లు ఎక్కువ రేంజ్‌లో ఉంటాయి. డీలర్‌షిప్‌లలో త్వరలో బుకింగ్‌లు ప్రారంభం కానుంది, ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆదర్శ ఎంపికగా మారనుంది.