Success Story: కష్టే ఫలి అంటారు. కష్టపడి మన ప్రయత్నం మనం చేస్తే విజయం అదే వరిస్తుంది. అంతేకాకుండా విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. రిస్క్ అనుకుని భయపడేవారు ఏనాడు ముందుకు రాలేరు. అలా వెనక్కి తగ్గకుండా కష్టాలను ఎదుర్కొనే వారు కచ్చితంగా ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కోల్‌కతాలో పెరిగిన రవి మోడీ ఒకరు.. తన కఠోర శ్రమతో విజయాల శిఖరాలను తాకారు. ఈరోజు రవి మోడీ పేరు దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది. నేడు అతని నికర విలువ రూ.30,000 కోట్లు దాటింది. ఆయనే మన్యవర్ ఎత్నిక్ వేర్ బ్రాండ్ వ్యవస్థాపకుడు, ఎండీ రవి మోడీ. మోడీ కంపెనీ బ్రాండ్ మాన్యవర్ భారతీయ వివాహ మార్కెట్‌లో సుపరిచితమైన పేరు. ఆయన మొదట్లోనే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి తన పని ప్రారంభించలేదు. తండ్రితో గొడవ పెట్టుకుని తల్లి ఇచ్చిన పదివేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. ఈ రోజు తన కష్టార్జితం వల్లే కోట్ల ఆస్తికి యజమాని అయ్యాడు.
చదువులో చురుగ్గా ఉండేవాడు
కోల్‌కతాలోని సాధారణ కుటుంబంలో జన్మించిన రవి మోడీ చిన్నప్పటి నుంచి చదువులో మెరుగ్గా ఉండేవాడు. తల్లితండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అయిన మోడీ గణితంలో మంచి ప్రతిభ కనబరిచాడు. అతని తండ్రి కోల్‌కతాలోని మార్కెట్‌లో రిటైల్ దుకాణం నడుపుతూ ఉండేవాడు. అక్కడ మోడీ చదువుతున్నప్పుడు తన తండ్రికి సహాయం చేసేవాడు. రవి మోడీ 2వ తరగతిలో ఉన్నప్పుడు మ్యాథ్స్‌లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. అతని కోసం అతని తల్లి పార్టీ ఏర్పాటు చేస్తుందని అనుకున్నాడు. అయితే 100 మార్కులతో తిరిగి వచ్చేసరికి కుటుంబంలో సాధారణ వాతావరణం కనిపించింది. అయితే తన విజయాన్ని ఎవరూ ఆస్వాదించరని అతడు గ్రహించాడు. అందుకే ఏదైనా భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు.
సేల్స్‌మెన్‌గా పనిచేశాడు
రవి మోదీ తండ్రికి కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ఉండేది. రవి మోడీ కూడా చిన్నప్పటి నుంచి తండ్రికి సాయం చేసేవాడు. 13 ఏళ్ల నుంచి రోజూ దుకాణానికి రావడం ప్రారంభించాడు. రవి మోడీ తన సొంత దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. తొమ్మిదేళ్లుగా షాపులో పనిచేస్తూనే అమ్మకాలలోని చిక్కుముడులు తెలుసుకున్నారు. ఈ సమయంలోనే అతను కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి బి.కామ్ చేశాడు.
తల్లి దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం
తండ్రితో మనస్పర్థలు రావడంతో రవి తన తల్లి వద్ద నుంచి రూ.10వేలు తీసుకుని బట్టలు తయారు చేయడం ప్రారంభించాడు. తన ఒక్కగానొక్క కొడుకు వేదాంత్ పేరు మీదుగా దానికి పేరు పెట్టాడు. అతను భారతీయ జాతి దుస్తులను తయారు చేసి కోల్‌కతా నుండి పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాలతో పాటు ఉత్తర ప్రదేశ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్‌లకు విక్రయించడం ప్రారంభించాడు. మంచి నాణ్యత, డిజైన్ కారణంగా వారు తయారు చేసిన దుస్తులను ప్రజలు ఇష్టపడ్డారు. దీని తర్వాత మోడీ తన దుస్తులకు ‘మన్యవర్’ బ్రాండ్‌గా పేరు పెట్టారు. మార్కెట్లతో పాటు విశాల్ మెగా మార్ట్, పాంటలూన్స్ వంటి పెద్ద దుకాణాలను కూడా టార్గెట్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వేదాంత ఫ్యాషన్ తొలి స్టోర్‌ను రవి మోడీ ప్రారంభించారు. నేడు దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ దుకాణాలు ఉన్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Success story of manyavar ethnic wear brand md ravi modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com