
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ సెక్టార్ లో కూడా ఎస్బీఐ దూసుకెళుతూ ఉండటం గమనార్హం. కొత్త ఇన్సూరెన్స్ పాలసీలను అందుబాటులోకి తెస్తూ ఎస్బీఐ ఇతర సంస్థలకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఆరోగ్య సుప్రీం పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
20 బేసిక్ కవరేజీలు, 8 ఆప్షనల్ కవరేజీలతో ఈ ఆరోగ్య బీమా పాలసీని ఎస్బీఐ రూపొందించడం గమనార్హం. ఈ ఆరోగ్య బీమా పాలసీ ద్వారా ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు బీమా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రో, ప్లస్, ప్రీమియం పేరుతో కవరేజ్ ఫీచర్లలో మూడు ఆప్షన్లలో ఏదైనా ఒకదానిని ఎంచుకునే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తుండటం గమనార్హం. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, రికవరీ బెనిఫిట్ ఒప్పందాల్లో భాగంగా పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో రోజురోజుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు అవసరాలకు తగిన విధంగా ప్రీమియం, పదవీకాలంను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అనేక రీఫిల్ ఫీచర్లను ఈ పాలసీ ద్వారా ఎస్బీఐ అందిస్తుండటం గమనార్హం. రిటైల్ కస్టమర్లకు ఈ పాలసీ ద్వారా కవరేజీలతో పాటు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు కంపెనీలు వేర్వేరు పాలసీలను అందిస్తుండటం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా కంపెనీలు ప్రీమియం రేట్లను భారీగా పెంచడం గమనార్హం. ఈ పాలసీని తీసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది.