Business Ideas: ఉద్యోగం అయితే ఒకరి కింద పని చేయాల్సి వస్తుంది.. మన శక్తిని అంతా ఒక కంపెనీ లేదా సంస్థకు ధార పోయాల్సి వస్తుంది.. అని కొందరి భావన. దీంతో చాలామంది సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటారు. అయితే వ్యాపారం చేయడం అంటే ఆషామాషీ కాదు. సరైన మెలకువలు ఉండడంతో పాటు శక్తి వంచన లేకుండా కృషి ఉండడంవల్ల ఇందులో రాణిస్తారు. అంతేకాకుండా ఒక వ్యాపారాన్ని ప్రారంభించేముందు దేనికైనా సిద్ధపడాలి. అంటే లాభం రావచ్చు లేదా నష్టం కూడా రావచ్చు.. ఎటువంటి పరిస్థితినైనా తీసుకోగలిగే సత్తా ఉంటేనే వ్యాపారాన్ని ప్రారంభించాలి. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు దానిని మార్కెటింగ్ ఎలా చేయాలి? వ్యాపారులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? వ్యాపారం చేస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి. ఈ విషయాలను సాధారణంగా కాకుండా సినిమాల ద్వారా తెలుసుకుంటే మరింతగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
స్వయంకృషి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఎదగడానికి ఒక వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఈ సినిమాలో చూపించారు. అలాగే వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. మానవ విలువలు కూడా అవసరమే అని ఇందులో చెప్పారు. అందువల్ల ఈ సినిమాను చూసి వ్యాపార మెలకువలు తెలుసుకోవచ్చు.
మిస్ ఇండియా:
కీర్తి సురేష్ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. ఇందులో టి వ్యాపారాన్ని అమెరికాలకు పరిచయం ఎలా చేయాలి? అక్కడ ఎలా సక్సెస్ సాధించాలి? అనే దానిపై హీరోయిన్ తీవ్రంగా కృషి చేస్తుంది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని చివరకు ఎలా విజయం సాధించారు? అనేది సినిమాలో చూపించారు. అందువల్ల వ్యాపారస్తులకు ఇది కూడా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.
బ్లఫ్ మాస్టర్:
సత్యదేవ్ నటించిన ఈ సినిమా వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో నెగటివ్ రోల్ లో చూపించారు. ఒక ప్రోడక్ట్ ను మార్కెట్లో ఎలా తీసుకెళ్లాలి అనే విషయం ఇందులో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో చూపించిన విధంగా కాకుండా జెన్యూవుగా.. నిజాయితీగా మార్కెట్లోకి వెళ్తే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆకాశమే హద్దురా:
హీరో సూర్య నటించిన ఈ సినిమా జి ఆర్ గోపీనాథ్ బయోపిక్. పేదవారికి కూడా విమానా ప్రయాణం అందించాలని ఉద్దేశంతో తాను చేసిన కృషి ఇందులో కనిపిస్తుంది. అంటే వ్యాపారం అంటే కేవలం డబ్బు అర్జన మాత్రమే కాకుండా మానవ సంబంధాలు కూడా ముఖ్యమే అని ఇందులో చూపించారు.