Homeబిజినెస్Diesel vs Petrol Cars: ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ కార్లు కొనాలా.. వద్దా.. ఎవరికి ఉపయోగం..

Diesel vs Petrol Cars: ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ కార్లు కొనాలా.. వద్దా.. ఎవరికి ఉపయోగం..

Diesel vs Petrol Cars: ఆటోమోబైల్ రంగంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల హడావుడి పెరుగుతోంది. అయినప్పటికీ SUV విభాగంలో డీజిల్ ఇంజిన్ల హవా ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం SUV అమ్మకాల్లో డీజిల్ వాటా 18 శాతంగా ఉంది. దీంతో కొన్ని వర్గాల వారు ఇంకా SUV వేరియంట్ లో డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దూరప్రయాణాలు చేసేవారు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించేవారు, గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఇప్పటికీ డీజిల్ ఇంజిన్‌లనే నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా BS7 అమల్లోకి వస్తే డీజిల్ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో డీజిల్ కార్లు కొనాలా? వద్దా? అన్న సందేహం కలుగుతోంది.

BS7 నిబంధనలు
రాబోయే రోజుల్లో అమలు కానున్న BS 7 (Bharat Stage 7) ఉద్గార నిబంధనలు కార్ల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లను మార్చడం వల్ల తయారీ ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇప్పటికే BS6 నిబంధనల వల్ల డీజిల్ కార్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు BS7 అమల్లోకి వస్తే ముఖ్యంగా రూ.20 లక్షల లోపు ఉండే మధ్యతరహా SUVల ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇది సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

డీజిల్ కార్లు కొనాలా? వద్దా?
ప్రస్తుత తరుణంలో డీజిల్ కారు కొనాలనుకునే వారు తమ ప్రయాణ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీ నెలవారీ ప్రయాణం 1,500 నుండి 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండి.. తరచుగా హైవేలపై లాంగ్ ట్రిప్స్ చేసేవారైతే డీజిల్ కారు ఇప్పటికీ లాభదాయకమే. డీజిల్ ఇంజిన్ ఇచ్చే మైలేజ్, పవర్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎక్కువే. అయితే, కేవలం నగర పరిధిలోనే తిరిగేవారు లేదా తక్కువ ప్రయాణం చేసేవారు పెట్రోల్ లేదా హైబ్రిడ్ ఆప్షన్లను పరిశీలించడం మంచిది.

భవిష్యత్తు సవాళ్లు మరియు రీసేల్ వాల్యూ
ధరల పెరుగుదలతో పాటు, భవిష్యత్తులో డీజిల్ వాహనాలపై వచ్చే ఆంక్షలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని మెట్రో నగరాల్లో పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలపై నిషేధం ఉండటం, రాబోయే కాలంలో పర్యావరణ నిబంధనలు మరింత కఠినతరం కావడం వల్ల వీటి రీసేల్ వాల్యూ (మళ్లీ అమ్మేటప్పుడు వచ్చే ధర) తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని కొనుగోలు చేయడం మంచిది. ఒకవేళ భారీ పవర్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కోరుకుంటేనే ఇప్పుడు డీజిల్ SUVని ఎంచుకోవడం సమంజసం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular