SBI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ వీలర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. తక్కువ వడ్డీకే టూ వీలర్ లోన్లను అందిస్తోంది. 20,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈ ఆఫర్ లో భాగంగా ఎస్బీఐ కస్టమర్లు లోన్ పొందే అవకాశం ఉండగా ఎస్బీఐ కస్టమర్లకు ఈ లోన్ ఆఫర్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. ఎంపిక చేసిన కస్టమర్లు మాత్రమే ఎస్బీఐ ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఎస్బీఐ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ను అందించనుందని సమాచారం అందుతోంది.
బ్యాంక్ కండీషన్లను, ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకుని ఈ ఆఫర్ కు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వాహనం ఆన్ రోడ్ ధర, డీలర్ వివరాలను ఇవ్వడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆఫర్ ఎస్బీఐ కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.