Samsung New Mobile Phones: ఫెస్టివల్ సీజన్ కావడంతో చాలా కంపెనీలు ఆఫర్లు తీసుకొస్తున్నాయి. త్వరలో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. అంతకుముందు మొబైల్స్ పై జీఎస్టీ తగ్గడంతో సెప్టెంబర్ 22 నుంచి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ రెండిటినీ దృష్టిలో ఉంచుకుని చాలామంది కొత్తగా ఫోన్ కొనాలని అనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు వినియోగదారుల నుంచి కీలకమైన సమాచారం దొంగిలించాలని అనుకుంటున్నాను. ఫేక్ లింక్స్ పంపించి మొబైల్ పై ఆఫర్స్ ఇస్తున్నట్లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ కంపెనీ సాంసంగ్ వినియోగదారుల కోసం కీలకమైన సమాచారం ఇస్తూ అలర్ట్ చేసింది. అదేంటంటే?
ప్రస్తుత కాలంలో ఆన్లైన్ లోనే మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. బయట షాప్ లో కంటే ఆన్లైన్లో ధర తక్కువగా ఉండడంతో పాటు.. కొన్ని ఆఫర్స్ వర్తించడంతో మరింత తక్కువకు మొబైల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీ తగ్గడంతోపాటు పండుగల ఆఫర్తో ఎక్కువగా ధర ఉన్న మొబైల్స్ తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. అందులోనూ బ్రాండెడ్ కంపెనీ అయినా శ్యాంసంగ్ ప్రియులు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వారు ఆన్లైన్లో మొబైల్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కంపెనీ తెలిపింది.
Amazon, Flipkart సంస్థల నుంచి ఫోన్ కొనాలని అనుకునేవారు కొన్ని లింక్స్ మాత్రమే ఓపెన్ చేయాలని పేర్కొంది. Amazon నుంచి Samsung మొబైల్ కొనాలని అనుకునేవారు Clicktech retail, Stpl exclusive, Darshital etel అనే సెల్లర్స్ నుంచి కొనుగోలు చేయాలని తెలిపింది. అలాగే Flipkart.. Truecom retail, MythanGlory retail, btpld, flashstar commerce లో కొనుగోలు చేయాలని తెలిపింది. ఇప్పటికే కొందరు సైబర్ నేరగాళ్లు ఫేక్ మొబైల్స్ ను ఆన్లైన్లో ఉంచి బ్రాండెడ్ కంపెనీ లాగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సాంసంగ్ ఒక హెచ్చరికలు జారీ చేసింది.
సాంసంగ్ కంపెనీ నుంచి మాత్రమే కాకుండా ఇతర కంపెనీల మొబైల్స్ కొనుగోలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. చాలామంది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో లాగిన్ అయిన తర్వాత మాత్రమే యాక్సెసరీస్ కొనాలని అంటున్నారు. అలా కాకుండా సోషల్ మీడియాలో ప్రముఖ కంపెనీల పేరుతో ప్రకటనలు వస్తూ ఉంటాయని.. ఇవి ఫేక్ గా ఉండి.. డబ్బులు చెల్లించుకుంటాయని.. ఆ తర్వాత వస్తువులు సరఫరా చేయమని చెబుతున్నారు. ఒకవేళ వస్తువులు సరఫరా చేసిన అవి బ్రాండెడ్ కంపెనీవి అయి ఉండవని.. అలాంటి వాటిని వినియోగదారులు కొనుగోలు చేసినా.. తర్వాత కంపెనీలు భరించుకోలేవని తెలిపింది. అందువల్ల ముందే నిజమైన లింక్స్ పై క్లిక్ చేసి వస్తువులు కొనుగోలు చేయాలని కంపెనీలు తెలుపుతున్నాయి.