Roadster X: ఓలా ఎలక్ట్రిక్ తమ రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే ఒక వేళ బైక్ బుక్ చేసుకున్న వాళ్లు అయితే డెలివరీకి ఇంకా లేట్ కావొచ్చు. ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ ఇప్పుడు మే నెలలో మొదలవుతుందని తెలిపింది. ఇంతకుముందు ఏప్రిల్ 2025 నాటికి డెలివరీలు ఉంటాయని చెప్పారు. భావిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ కంపెనీ మొదట మార్చిలోనే డెలివరీలు స్టార్ట్ చేస్తామని చెప్పింది. కానీ అది ఒక నెల ఆలస్యమైంది. ఇప్పుడు రెండోసారి రోడ్‌స్టర్ డెలివరీని పొడిగించారు. ఎక్స్ వేరియంట్‌తో పాటు లాంచ్ అయిన రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో మోడళ్ల రాకపై దీని ప్రభావం ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
Also Read: పాకిస్తాన్ కు మరో కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత్..!
ఓలా దీనిని కన్ఫర్మ్ చేయనప్పటికీ.. చాలా రిపోర్ట్‌లలో మొదట డెలివరీ ఆలస్యం కావడానికి కారణం రోడ్‌స్టర్ ఎక్స్‌పై డెలివరీ సమయానికి ముందు హోమోలోగేషన్ ప్రాసెస్ పూర్తి కాకపోవడమే అని పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 11, 2025న రోడ్‌స్టర్ ఎక్స్ మోడల్ మొదటి బ్యాచ్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చిందని కంపెనీ తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరిలో తమ అమ్మకాల డేటాలో 1,395 రోడ్‌స్టర్ ఎక్స్ బుకింగ్‌లను చేర్చింది. కానీ డెలివరీలు మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఈ చర్యతో కంపెనీ రెగ్యులేటరీ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్‌లో సెబీ ఓలా ఎలక్ట్రిక్‌ను ఇన్సైడర్ ట్రేడింగ్, అనుమానాస్పద లావాదేవీల కోసం విచారిస్తున్నట్లు పేర్కొంది. అయితే, కంపెనీ ఇటీవల ఇచ్చిన వివరణలో ఆ రిపోర్ట్‌ను పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు.
రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర
ఓలా కొంతకాలంగా రోడ్‌స్టర్ ఎక్స్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది. రోడ్‌స్టర్ ఎక్స్‌ను డీలర్‌షిప్‌లలో కూడా చూడవచ్చు. ఇది త్వరలో డెలివరీలు ప్రారంభం కానున్నట్లు సూచిస్తుంది. ఎంట్రీ-లెవెల్ కమ్యూటర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో లభించే అత్యంత సరసమైన ఈ-బైక్‌లలో ఒకటిగా నిలుస్తుంది.
రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్‌లో 2.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 140 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. మిడ్ వేరియంట్‌లో 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 196 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. టాప్ వేరియంట్‌లో 4.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 252 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. మూడు ట్రిమ్‌లలోనూ ఒకే 7 kW (9.3 bhp) మిడ్-డ్రైవ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
Also Read: పాకిస్తాన్ మహిళతో రహస్య వివాహం.. పహల్గాం దాడి తర్వాత బహిర్గతం!