https://oktelugu.com/

Renault ESpace: మైలేజీలో మార్కెట్లో దీనికి సాటిలేదు.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1100కి.మీ

Renault ESpace : ఈ కారులో 197bhp పవర్‌ను ఉత్పత్తి చేసే హైబ్రిడ్ ఇంజిన్‌ను కంపెనీ అందించింది. ఇది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1100 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. రెనాల్ట్ ఈ కారును టెక్నో, ఎస్పిరిట్ ఆల్పైన్, ఐకానిక్ అనే మూడు వేరియంటల్లలో విడుదల చేసింది. ఈ SUV కన్వర్టిబుల్ వేరియంట్ కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Written By: , Updated On : March 25, 2025 / 07:26 PM IST
Renault ESpace

Renault ESpace

Follow us on

Renault ESpace: రెనాల్ట్ గ్లోబల్ మార్కెట్‌లో కొత్త SUV రెనాల్ట్ ఈస్పేస్‌ను రిలీజ్ చేసింది. ఈ కారు స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఫుల్ ట్యాంక్‌తో ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.ఈ కారు 5, 7 సీటింగ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ SUVలో 70bhp పవర్, 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ కారులో 197bhp పవర్‌ను ఉత్పత్తి చేసే హైబ్రిడ్ ఇంజిన్‌ను కంపెనీ అందించింది. ఇది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1100 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. రెనాల్ట్ ఈ కారును టెక్నో, ఎస్పిరిట్ ఆల్పైన్, ఐకానిక్ అనే మూడు వేరియంటల్లలో విడుదల చేసింది. ఈ SUV కన్వర్టిబుల్ వేరియంట్ కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read : వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతున్న పవర్ ఫుల్ కార్లు ఇవే !

ఇంటీరియర్ గురించి మాట్లాడితే.. ఈ కారులో 1.7 మీటర్ల పొడవు, 1.13 మీటర్ల వెడల్పు గల పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. దీనితో పాటు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఈ SUVలో లభిస్తుంది. ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే.. ముందు భాగంలో హాఫ్ డైమండ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, వెనుక భాగంలో టాన్‌గ్రామ్-ప్రేరేపిత లైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఈ లైట్ ఎరుపు రంగులో కనిపిస్తుంది. డోర్ సేఫ్టీ కోసం కంపెనీ హై గ్లాస్ బ్లాక్ బ్లేడ్లను అందించింది.

ఈ కారులో డ్రైవర్ రికగ్నిషన్ సిస్టమ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఇది A పిల్లర్ కెమెరాను ఉపయోగించి డ్రైవర్‌ను గుర్తించడానికి .. సీటింగ్ పొజిషన్, మీడియా , గూగుల్ యాప్స్ సెట్టింగ్‌లను పర్సనలైజ్ చేయడానికి సాయపడుతుంది. ఈ SUVలో 24-అంగుళాల ట్విన్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 9.3-ఇంచుల హెడ్-అప్ డిస్‌ప్లే ఉంది. ఈ SUVలో ‘టేక్ ఎ బ్రేక్’! సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. ఇది డ్రైవర్ కళ్ల కదలికలు, ఆవలింతలను కూడా పర్యవేక్షిస్తుంది. విశ్రాంతి అవసరమైనప్పుడు ఈ కారు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఈ కారును భారతదేశానికి తీసుకువస్తారా లేదా అనే దాని మీద ప్రస్తుతానికి అయితే సమాచారం లేదు. ఈ SUV భారతదేశంలో రిలీజ్ అయితే.. ఈ కారు ధర ఎంత ఉంటుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : ఈ సారి హైబ్రిడ్‎ వెర్షన్లో మార్కెట్లోకి అప్ గ్రేడెడ్ మారుతి చౌక కారు