Reliance JioPhone: దేశీయ టెలీకాం దిగ్గజం జియో యూజర్లకు ప్రయోజనం చేకూర్చడం కొరకు ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఎక్కువ సంఖ్యలో యూజర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జియో ఆ సంఖ్యను మరింత పెంచాలనే ఉద్దేశంతో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి సిద్ధమైంది. గతంలో జియో ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చి సక్సెస్ సాధించగా జియో చౌకైన స్మార్ట్ ఫోన్ దిశగా అడుగులు వేయడం గమనార్హం.
జియో స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జియో ప్రీ బుకింగ్స్ ను పెట్టాలని నిర్ణయం తీసుకుంది. గూగుల్ తో కలిసి జియో ఫోన్ నెక్స్ట్ ను జియో మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. ఈ ఏడాది 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ కు సంబంధించిన ప్రకటన చేసినట్టు సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర 3,500 రూపాయలు అని సమాచారం.
5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. 2 జీబీ లేదా 3జీబీ ర్యామ్ తో 16/32 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ ను ఈ ఫోన్ లో వినియోగించారు. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)తో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది.
ఈ ఫోన్ లో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.