Toyota Romania: నేటి కాలంలో చాలా మంది విలాసవంతమైన కార్ల కోసం ఎదురుచూస్తున్నారు.అదే సమయంలో తక్కువ ధర తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే కార్లు ఏవో తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఇందులో బెస్ట్ ఫేవర్ గా నిలుస్తోంది టొయోటా రుమెనియా. తక్కువ బడ్జెట్ లో కారు పొందాలనుకునేవారు ఇది బెస్ట్ ఆప్షన్ గా పేర్కొంటున్నారు. అంతేకాకుండా విలాసవంతమైన కారుగా కూడా చెబుతున్నారు. మరి ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టొయోటా రుమేనియా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో కూడి ఉంది. ఈ మోడల్ కారు 136.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 75.8 కిలోవాట్ పవర్ ను అందించగలదు. డబుల్ ఇంజిన్ తో కూడిన ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఎస్ యూవీ లకు ధీటుగా విలాసవంతమైన స్పేస్ తో పాటు ఆకర్షణీయంగా డిజైన్ ను కలిగి ఉంది. స్కార్పియో తో నేరుగా ఢీ కొడుతున్న రుమేనియా పై వినియోగదారులు ఆశలు ఎక్కువ పెట్టుకుంటున్నారు.
రుమేనియా భారత మార్కెట్లోకి రిలీజ్ అయిన తరువాత చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కారు ప్రారంభ ధరను రూ.8 లక్షలుగా కేటాయించారు. ఇతర కార్లతో పోలిస్తే దీని ధర తక్కువగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా ప్రీమియం కార్లతో సమానంగా ఫీచర్స్ ను కలిగి ఉన్నా.. అంతకంటే తక్కువ ధరకే వినియోగదారులకు అవకాశం రావడంతో చాల మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇది గరిష్టంగా 28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం విశేషం.
అప్డేట్ ఫీచర్స్ తో పాటు తక్కువ బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక అని అంటున్నారు. అంతే కాకుండా నేటి కాలంలో ప్రీమియం కార్ల కంటే ఇలాంటి వాటికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం మిడిల్ క్లాస్ ను బేస్ చేసుకుని వారికి అనుగుణంగా ఉత్పత్తులను చేపడుతుంది. విశాఖ వంతమైన స్పేస్ కూడా ఉండడంతో ఫ్యామిలీ టూర్ కు ఇది మంచి వెహికల్ అని అంటున్నారు.