https://oktelugu.com/

Own House Vs Rent House: సొంత ఇల్లు వద్దు.. అద్దె ఇల్లు ముద్దు..!

తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్ కొనాలంటే రూ.7.5 నుంచి రూ.7.8 కోట్ల ఖర్చతువుతందని తెలిపాడు. అయితే దీనిని కొనుగోలు చేయడానికి 70 శాతం లోన్ తీసుకుంటే దాని ఈఎంఐ నెలకు రూ. 6 నుంచి రూ.7 లక్షలు చెల్లించాలి. కానీ ప్రస్తుతం తాను 1.5 లక్షల అద్దె చెల్లించి నివాసం ఉంటున్నట్లు తెలిపాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 2, 2024 / 11:44 AM IST

    Rent House vs Own House

    Follow us on

    Own House Vs Rent House:  జీవితంలో ఒక్కసారే ఇల్లు కట్టుకుంటారు.. కట్టుకోవాలి కూడా.. ఎందుకంటే సొంతింట్లో ఉన్న ఆ ఆనందమే వేరు.. అని కొందరి అభిప్రాయం. అందుకే సొంతింటి నిర్మాణం కోసంకలలు కంటారు. తమ జీవిత లక్ష్యంగా దీనిని ఏర్పరుచుకుంటారు. ఈ క్రమంలో అప్పులు చేసి తిప్పలు పడుతూ ఏదో రకంగా ఓ గూడును ఏర్పాటు చేసుకుంటారు. అయితే సొంతిల్లు ఉండడం అంటే మామూలు విషయం కాదు. నేటి కాలంలో సాధారణ ఇల్లు కావాలన్నా రూ. 50 లక్షల ఖర్చు అవుతుంది. కానీ సొంత ఇల్లు కంటే అద్దె ఇల్లు ఎంతో బెటర్ అని ఓ ప్రముఖుడు తెలిపాడు. ఆయన అలా ఎందుకు అన్నాడంటే?

    అద్దె ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఓనర్ కు నచ్చినట్లు ఉండాలి. ప్రైవసీ ఉండదు. కనీసం ఇంట్లో ఎక్కువ మంది కనిపించినా ఓనర్ కు నచ్చదు. స్వేచ్చగా పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇలాంటి సమయంలో సొంత ఇల్లు ఉంటే బాగుండు.. అని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరు ప్రముఖులు మాత్రం సొంత ఇల్లు కంటే అద్దె ఇల్లు ఎంతో బెటర్ అని అభిప్రాయపడుతున్నారు.

    ప్రముఖ కంపెనీ బాంబే షేవింగ్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను దేశ్ పాండే ఇటీవల అద్దె ఇల్లుపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అద్దె ఇల్లు ఎంతో బెటర్ అని అన్నారు. తాను ఓ కంపెనీకి సీఈవో అయినా ఓ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపాడు. అయితే బాంబే లోని తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్ కొనాలంటే రూ.7.5 నుంచి రూ.7.8 కోట్ల ఖర్చతువుతందని తెలిపాడు. అయితే దీనిని కొనుగోలు చేయడానికి 70 శాతం లోన్ తీసుకుంటే దాని ఈఎంఐ నెలకు రూ. 6 నుంచి రూ.7 లక్షలు చెల్లించాలి. కానీ ప్రస్తుతం తాను 1.5 లక్షల అద్దె చెల్లించి నివాసం ఉంటున్నట్లు తెలిపాడు.

    సొంత ఇల్లు కొనుక్కొని చెల్లించే ఈఎంఐలో నాలుగో వంతులో అద్దె చెల్లిస్తున్నట్లు తెలిపాడు. సొంత ఇల్లు అయినా, అద్దె ఇల్లు అయినా.. అవే సౌకర్యాలు ఉంటాయన్నారు. అలాగే తాను పనిచేసే కార్యాలయానికి దగ్గర ఉండడం వల్ల మరింత సేఫ్ అవుతుందని అన్నాడు. అందువల్ల సొంత ఇల్లు కంటే అద్దె ఇల్లు ఎంతో బెటర్ అని అన్నాడు. కానీ ఈయన వాదనకు కొందరు సపోర్టు చేయగా..మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. సొంత ఇంట్లో ఉన్న ఆనందం వేరని కామెంట్స్ చేస్తున్నారు.