spot_img
Homeబిజినెస్Oppo K14x 5G: మెగా ఫీచర్స్.. క్వాలిటీ కెమెరా.. ధర రూ. 13 వేల లోపే..

Oppo K14x 5G: మెగా ఫీచర్స్.. క్వాలిటీ కెమెరా.. ధర రూ. 13 వేల లోపే..

Oppo K14x 5G: భారతదేశంలో ప్రసిద్ధ మొబైల్ ఫోన్లలో Oppo కంపెనీ ఒకటి. మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఈ కంపెనీ మొబైల్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా సంవత్సరాలుగా నాణ్యతతో ఉండే ఈ మొబైల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మార్కెట్లోకి వస్తుంటాయి. 2026 సంవత్సరం సందర్భంగా ఒప్పో కంపెనీ నుంచి K 14 x 5G అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే గత ఏడాదిలో K 13 x 5G అనే మొబైల్ రిలీజ్ అవ్వగా.. దానికంటే ఎక్కువ ధరతో ఇది మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఇందులో ఉండే ఫీచర్స్.. కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉండే విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కాలం మారుతున్న కొద్దీ వినియోగదారులకు అనుగుణంగా మొబైల్స్ ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా కంపెనీ ఏదో కొన్ని మొబైల్స్ లు అప్డేట్ చేస్తూ రిలీజ్ చేస్తుంటాయి. ఒప్పో కంపెనీకి చెందిన K 14 x 5G విడుదలతో యూత్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ లో 6.75 అంగుళాల HD+ డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో నైనా 1,125 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. అలాగే ఇది LCD ప్యానెల్ కలిగి ఉండడంతో చేతిలో పట్టుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చీప్ సెట్ ఉండనే ఉంది. వీటితోపాటు 6 GB రామ్ పనిచేస్తుంది. స్టోరేజ్ కోసం ఇందులో 128 GB కెపాసిటీ ఉంచారు. దీంతో రోజువారి పనుల కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కెమెరా విషయానికి వస్తే ఒప్పో K 14 x 5G లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది.2 MP మోనో క్రోమ్ కెమెరా ఉండనుంది. సెల్ఫీతోపాటు వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా పనిచేస్తుంది. గతంలో కంటే ఈ మొబైల్ లో సెన్సార్ ఏఐ ఫీచర్లతో కలిగి ఉండడంతో అద్భుతమైన ఫోటోగ్రఫీని పొందవచ్చు. అంతేకాకుండా నాణ్యమైన కలర్తో చిత్రాలను తీయడానికి ఈ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొత్త మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 20 గంటల పాటు నిరంతరంగా వాడుకోవచ్చు. అలాగే చార్జింగ్ కోసం 45 వాట్ చార్జర్ ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. బిజీగా ఉండేవారు వెంటనే చార్జింగ్ కావాలని అనుకుంటే ఈ చార్జర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఈ కంపెనీ ఎప్పటికీ ఫోన్లను తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కొత్త K 14 x 5G మొబైల్ ను రూ.12,999 ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular