OnePlus Nord 6 features: చైనా కు చెందిన ఎన్నో మొబైల్స్ కంపెనీలో భారత్లో తమ అధిపత్యాన్ని చాటుతున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీకి చెందిన కొత్త మొబైల్ రావడానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఇది లాంచ్ కానుండడంతో దీనిపై ఇప్పటి నుంచే అంచనాలు మించిపోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీనిని కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ మొబైల్ లో ఇప్పటివరకు ఇందులో లేని విధంగా ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో పాటు విభిన్నమైన కలర్లలో అందుబాటులోకి రాబోతుంది. అంతేకాకుండా దీని బ్యాక్ సైడ్ గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉండనున్నాయి. దీంతో మొబైల్ డిజైన్ స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో ఏమేం ఉన్నాయంటే?
ఏప్రిల్ 6వ తేదీన మార్కెట్లోకి రాబోతున్న Oneplus Nord 6 మొబైల్ డిస్ప్లే 6.78 అంగుళాల AMOLED తో ఉండనుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తూ 1.5 K Resolution ఉంటుంది. 3600 nits బ్రైట్నెస్ తో ఎలాంటి వాతావరణం లోనైనా ప్రకాశవంతమైన వెలుగును చూడవచ్చు. ఈ కొత్త మొబైల్ లో Qualcomm స్నాప్ డ్రాగన్ 8s Gen 4 చిప్ సెట్ ను అమర్చారు.12 GB వరకు రామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. దీంతో గేమింగ్ కోరుకునే వారితో పాటు మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఈ ప్రాసెసర్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఏఐ తరహాలో అవసరమైన ఫీచర్ల కోసం సపోర్టుగా ఉంటుంది.
ఈ మొబైల్లో వెనుక వైపు డ్యూయల్ కెమెరాను చూడొచ్చు. ఈ కెమెరాలు కొత్త తరాన్ని ఆకర్షించేలా చతురస్రాకారంలో ఉంటాయి. ఈ కెమెరాలో 50 MP మెయిన్ కెమెరా ఉండగా..2 మెగాపిక్సల్ మోనోక్రోమ్ కెమెరా ఉండనుంది. సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా పనిచేస్తుంది. ఈ కెమెరా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ షార్ట్ తీసిన కూడా Resolution తగ్గకుండా నాణ్యమైన ఫోటో వస్తుంది. ఈ మొబైల్ లో బ్యాటరీ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 9000 mAh బ్యాటరీ ఉండగా.. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజులపాటు చార్జింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ 27 వాట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
ఇప్పటికే Oneplus నుంచి Nord 5 మొబైల్ 2025లో మార్కెట్లోకి వచ్చింది. దీనికంటే Oneplus Nord 6 ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త మొబైల్ ధర రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉంది.