One Plus Pad Go 2: ప్రస్తుతం మొబైల్ తో ఎటువంటి పనులు అయినా చేసుకునే అవకాశం ఉంది. అయితే కొంతమంది వీడియోలు, సినిమాలు చూసేందుకు బిగ్ స్క్రీన్ తో మొబైల్ కావాలని కోరుకుంటారు. అలాగే పిల్లలకు గేమింగ్స్ కోసం కూడా ఇది అనుకోగా ఉంటుంది. బిగ్ సీన్ అనగానే కంప్యూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ మొబైల్, కంప్యూటర్ కు మధ్యలో ప్యాడ్ లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి మొబైల్ తో పోలిస్తే ఎక్కువ ధర.. కంప్యూటర్తో పోలిస్తే తక్కువ ధరతో కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడికి అంటే అక్కడికి తీసుకువెళ్లే సౌకర్యం ఉండడంతో చాలామంది దీనిని కోరుకుంటారు. అయితే ఇప్పుడు మార్కెట్లోకి One plus కంపెనీకి చెందిన కొత్త రకమైన ప్యాడ్ ఆకర్షిస్తుంది. ఇందులో ఉన్న ఫీచర్స్, డిజైన్ చూసి వెంటనే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?
One Plus కంపెనీకి చెందిన Pad Go 2 మార్కెట్లో సందడి చేస్తోంది. ఇది చూడడానికి ప్రీమియం లుక్ తో కనిపిస్తూ అత్యంత రక్షణ ఇచ్చే ప్యానెల్ ను కలిగి ఉంది. టేబుల్ పై ఉంచేందుకు వీలుగా అచ్చం టీవీ వలె కనిపించే విధంగా దీనిని తయారు చేశారు. ఇది చూస్తే చాలా సన్నగా కనిపించినప్పటికీ.. మార్ట్ ఫినిషింగ్, వేలిముద్రలు, మరకలను తొలగించేందుకు వీలుగా పనిచేస్తుంది. 16: 10 డిస్ప్లే తో ఉండడంతో ఇందులో వీడియోలు చూస్తే సినిమా అనుభూతి కలుగుతుంది. దీని డిస్ప్లే 12.1 అంగుళాల 2.8 కె పానెల్ ను కలిగి ఉంది. LCD డిస్ప్లే తో ఉన్న ఇది 12 బిట్ కలర్ డెప్త్ ను కలిగి ఉంది. దీని పిక్సెల్ సాంద్రత 284 ppi వద్ద ఉంది. దీంతో ప్యాడ్ కు సమానంగా స్క్రీన్ ఉండడంతో అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.
ఈ ట్యాబ్ లో ఒకవైపు మొబైల్ ఫీచర్లు ఉండడంతో పాటు మరోవైపు కంప్యూటర్ రేంజ్ లో పనులు చేసుకోవచ్చు. ఇందులో, 8GB Ram ను ఉంచారు. అలాగే స్టోరేజ్ కోసం 128 GB ని అమర్చారు. దీంతో ఇందులో కావలసిన ఫైల్స్, వీడియోలు, ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ ప్యాడ్ GO 3.8 లక్షల స్కోర్ కంటే పెద్దది. గతంలో వచ్చిన ప్యాడ్ కంటే మెరుగుదల ఫీచర్లు ఇందులో అమర్చారు. మొబైల్ కొనుగోలు దారులు ఎక్కువగా కెమెరా పని తీరు గురించి ఆసక్తిగా పరిశీలిస్తారు. అయితే One Plus Go 2 మొబైల్లో మెయిన్ కెమెరా 8 MP ఉండనుంది. కంటి కెమెరా 8 MP నీ అమర్చారు. రెండు కెమెరాలు ఒకే మెగా పిక్సెల్ తో ఉండడంతో ఎటువైపు నుంచైనా ఫోటోగ్రఫీ అద్భుతంగా వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. అలాగే ఇది 2x zoom తో కావలసిన వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో 10,050 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 60 రోజుల స్టాండ్ పై సమయాన్ని క్లీన్ చేస్తుంది. ఒక మూవీ చూస్తే 32 శాతం మాత్రమే బ్యాటరీ తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇలా అన్ని రకాల ఫీచర్లు ఆకట్టుకోవడంతో ఈ ట్యాబ్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.