Walmart And Anazon: ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ లో కొనేళ్ల నుండి చక్రం తిప్పుతున్న వాల్మార్ట్ మరియు అమెజాన్ సంస్థలకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యిపోయాడు నందన్ నిలకేని..ఈయన మన భారత దేశం లో సాఫ్ట్ వేర్ రంగం లో దిగ్గజం లాగ నిలిచినా ఇన్ఫోసిస్ కంపెనీ ని స్థాపించిన వారిలో ఒక్కరు..అంతే కాకుండా ప్రస్తుతం ఈయన ఆ కంపెనీ లో 2017 వ సంవత్సరం నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా పని చేస్తున్నారు..ఇక అసలు విషయానికి వస్తే వాల్మార్ట్ మరియు అమెజాన్ వంటి సంస్థలు 20 బిలియన్ డాలర్స్ వరుకు ఖర్చు చేసి 80 శాతం కి పైగా రిటైల్ మార్కెట్ ని సొంతం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు..వీరి ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళకి సంబంధించిన కొన్ని ట్రేడర్స్ తో కనివిని ఎరుగని రేంజ్ డిస్కౌంట్స్ తో అమ్మేయడానికి మాస్టర్ ప్లాన్ చేసారు..ఇలా చెయ్యడం వల్ల ఇండియా లో కిరానా కోట్లు నడుపుకునే చిన్న చిన్న వ్యాపారస్తులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది..ప్రస్తుతం వాళ్ళందరూ తమ భవిష్యత్తు ఏమిటా అని ఆందోళన చెందుతున్నారు.

Also Read: Samantha Birthday: దేవకన్యలా సమంత రచ్చ.. లుక్ చూసి మెంటలెక్కిపోతున్న ఫ్యాన్స్ !
అలా తమ భవిష్యత్తు పై ఆందోళన చెందుతున్న ఇలాంటి చిన్న వ్యాపారస్తులకు ఊరట కలిగించేలా నందన్ నీలకేని తమ కంపెనీ ద్వారా ఒక్క అప్లికేషన్ ని మన ముందుకి అతి త్వరలోనే తీసుకొని రాబోతున్నారు..ఈ అప్లికేషన్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రొడక్ట్స్ ని అమ్ముకునే వెసలుబాటు కలిగిస్తున్నాడు..అమెజాన్ మరియు వాల్మార్ట్ అప్లికేషన్స్ ని తలదన్నే విధంగా ఈ యాప్ ని డిసైన్ చెయ్యబోతున్నారు అట.. ఈ అప్లికేషన్ ద్వారా రిటైల్ ఇండస్ట్రీ ఒక్క ట్రిలియన్ పైగా బిజినెస్ మార్కెటింగ్ జరిగేలా ప్లాన్ చేసాడట..సాధ్యమైనంత తొందరగా ఈ అప్లికేషన్ ని తయారు చేసి మార్కెట్ లోకి తీసుకోచేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసేసాడు..ఈ అప్లికేషన్ లో చిన్న చిన్న డిటర్జెంట్ బార్స్ దగ్గర నుండి ఫ్లైట్ టికెట్స్ వరుకు ప్రతి ఒక్కటి అమ్ముకోవచ్చు..రిటైల్ ఇండస్ట్రీ లో ఎంతో కాలం నుండి తమ ఆధిపత్యం ని చూపిస్తున్న వాల్మార్ట్ మరియు అమెజాన్ వంటి కంపెనీలకు ఎదురెళ్లి, విప్లవం ని సృష్టించే స్థాయి నిర్ణయం తీసుకున్న నందన్ నిలకేని తన లక్ష్యం ని విజయవంతంగా చేరుకుంటాడో లేదో చూడాలి..ఈ అప్లికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Acharya: ‘ఆచార్య’ చూసిన వారంతా చెప్పిన ఒకే ఒక్క మాట.. ఇదే !