Motorola Moto Watch: ఆడవారితో పాటుగా మగవారు కూడా స్టైలిష్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఆడవారిలా మగవారికి ఆభరణాలు వంటివి లేకపోయినా కొన్ని వస్తువులు పురుషులకు అందాన్ని తీసుకువస్తాయి. వీటిలో ప్రధానంగా డ్రెస్సింగ్, షూస్ వంటివి ఉంటాయి. వీటితోపాటు చేతికి అందమైన వాచ్ ఉంటే రిచ్ లుక్ కనిపిస్తుంది. కొంతమందికి చేతికి గడియారం లేకుంటే బయటకు వెళ్లడానికి ఇష్టం ఉండదు. అయితే ఈ చేతి గడియారం లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది. సెలబ్రిటీలు, ఉన్నత వర్గానికి చెందినవారు అత్యధిక ఖరీదైన వాచ్ లను ధరిస్తూ ఉంటారు. వీరితోపాటు చేతికి ఖరీదైన వాచ్ ఉండాలని అనుకునే వారికోసం మార్కెట్లోకి కొత్త రకాల మోడల్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా Moto కంపెనీ నుంచి కొత్త వాచ్ త్వరలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఇది ఎలా ఉంటుందంటే..?
ఇప్పటివరకు మోటరోలా నుంచి మొబైల్స్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు పురుషులకు అందాన్ని తీసుకువచ్చే వాచ్ లను కూడా ప్రవేశపెడుతోంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 23న ఈ వాచ్ ను ప్రారంభించబోతుంది. ఇందులో భాగంగా దీని గురించి ఇప్పటికే CES లో ప్రస్తావించింది. స్మార్ట్ ఫోన్ తో పాటు, స్మార్ట్ ఫ్యూచర్ లో ఉన్న ఈ వాచ్ యూత్ తో పాటు ఉన్నత వర్గాలకు బాగా నచ్చుతుంది అని తెలుస్తుంది. ఇందులో ఉండే మెరుగైన ఫీచర్లు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ వాచ్ 1.4 అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కు రక్షణగా గొరిల్లా గ్లాస్ తో రక్షణ ఉండనుంది. దీంతో బిజీ వాతావరణం లో ఉండడంతో పాటు ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ఇది భద్రత ఇస్తుంది. ఈ విభాగంలో గొరిల్లా గ్లాస్ కలిగిన ఏకైక వాచ్ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఈ వాచ్ లో స్టెప్స్ కౌంట్ యాప్ కూడా చేర్చారు. అలాగే నిద్ర, ఒత్తిడి, హృదయస్పందన, ఆక్సిజన్ రేట్ వంటి విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. దీంతో ఆరోగ్య పరిరక్షణ కోరుకునే వారికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది.
దీనిపై ఉండే గ్లాస్ IP 68 రేటింగ్ తో ఉంటుంది. దీంతో దుమ్ము, వాటర్ నుంచి రక్షణ పొందుతుంది. అలాగే ఈ వాచ్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏడు రోజులపాటు బ్యాటరీ నిల్వ ఉంటుంది. వాచ్ చుట్టూ 47 MM రౌండ్ ఫేస్, ఇస్కాన్ బ్లాస్టెడ్ అల్యూమినియం ఫ్రేమ్లో కలిగి ఉండడంతో ఒక్కోసారి కింద పడ్డ కూడా ఎలాంటి డామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే హ్యాండ్ ఫ్రీ కాల్స్, నోటిఫికేషన్ రిమైండర్, క్యాచ్ మీ అప్ వంటి AI ఫీచర్లను కూడా ఇందులో చేర్చారు. ఆకర్షణీయమైన రంగులతో ఉన్న ఈ వాచ్ లను ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. వేరియంట్ లను బట్టి ధర నిర్ణయం అవుతుంది.