Motorola Signature: మొబైల్ మార్కెట్లోకి ఎన్నో రకాల ఫోన్లు వచ్చినా.. కొన్ని బ్రాండెడ్ వాటికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన ఏ కొత్త ఫోన్ ను ప్రవేశపెట్టినా వెంటనే దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఇందులో భాగంగా మొబైల్స్ కంపెనీలు సైతం వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్, ఫీచర్స్ అప్డేట్ చేస్తూ తీసుకువస్తుంటాయి. ఇందులో భాగంగా Motorola కంపెనీ లేటెస్ట్ గా ప్రీమియం మొబైల్ ను తీసుకురానుంది. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లు ఉండడంతోపాటు.. నేటి తరం వారికి ఆకట్టుకునేలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మోటరోలా కంపెనీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడం తో ఈ కంపెనీకి చెందిన ఫోన్లపై చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ కంపెనీ తెస్తున్న కొత్త ఫోన్ ఎలా ఉందంటే?
Motorola Signature Series పేరుతో త్వరలో కొత్త మొబైల్ ను తీసుకురానుంది. ఇది ఇప్పటివరకు మార్కెట్లోకి తీసుకువచ్చిన Edge 70 తో సమానమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇందులో కొత్తగా ఫ్లాగ్ ఫిష్ అమర్చారని తెలుస్తోంది. ఈ మొబైల్ లోని డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.7 అంగుళాల 1.5K OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 144 Hz రిఫ్రిష్ రేటుతో పనిచేయనుంది. ఈ డిస్ప్లేతో నాణ్యమైన వీడియోలను వీక్షించవచ్చు. అలాగే గేమింగ్ అలవాటు ఉన్నవారు ఇందులో అద్భుతంగా అనుభవాన్ని పొందవచ్చు.
ఈ కొత్త మొబైల్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 MP ప్రధాన కెమెరా ను అమర్చారు. ఇది OIS సోనీ లైటియా సెన్సార్ తో కలిపి ట్రిపుల్ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు కూడా తీసుకునే విధంగా మెగా పిక్సెల్ అద్భుతంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. చాలామంది కెమెరాను ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఫోటోలు మాత్రమే కాకుండా 4K వీడియోలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే ఇందులో బ్యాటరీ వ్యవస్థను కూడా మెరుగుపరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా మొబైల్లో 7,000 mAh బ్యాటరీ ఉంది. అయితే ఇప్పుడు మోటరోలా సిగ్నేచర్ లో కూడా ఇదే బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ ను జనవరి 7న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ ఎడ్జ్ 70 ఆల్ట్రా ను పోలి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఆ మొబైల్ కు రీ బ్రాండెడ్ వర్షన్ అని అంటున్నారు. అయితే లాంచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.