MG Astor: కారు కొనాలనుకునేవారు SUVలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కంపెనీలు సైతం హ్యాచ్ బ్యాక్ లకంటే SUVలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ వేరియంట్ లో ఇప్పటికే అలరించిన కొన్ని మోడళ్లు అప్డేట్ అయి వస్తున్నాయి. 2024 కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ను SUV కాంపాక్ట్ లో తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా MG కంపెనీ సైతం ఇప్పటికే ఉన్న Astorను SUV కాంపాక్ట్ లో అప్డేట్ చేసి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మోడల్ రాకతో ఆటోమోబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించినట్లవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కారు ధర, స్పెషిఫికేసన్ ను విడుదల చేసింది. వీటిని చూసి కారు వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే?
MG Astor ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు దీనిని అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. కొత్త మోడల్ స్పెషిఫికేషన్ చూస్తే.. 1.4 లీటర్, 1.5 లీటర్ అనే రెండు పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంది. ఇది 108 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డ్రైవర్ డిజిల్ డిస్ ప్లే ఆక్టుకుంటుంది. ఈ కారులో సేప్ట్ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ను సెట్ చేశారు.
ఈ మోడల్ కియా సెల్టోస్ కాంపాక్ట్ కంటే తక్కువ ధరలో అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కియా సెల్టోస్ 10.89 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే MG Astor ను 9.98 లక్షల ఎక్స్ షోరూంతో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ ను రూ.17.90 లక్షలతో అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇందులో ఇస్మార్ట్ 2.0 వంటి ఫీచర్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. జియో వాయిస్ రికగ్నైషన్ సిస్టమ్ తో వాయిస్ క్రికెట్ అప్డేట్, జాతకం వంటి విషయాలు తెలుస్తాయి.
ఎస్ యూవీలు కోరుకుంటున్న నేటి తరుణంలో కంపెనీలు సైతం వీటి ఉత్పత్తిని పెంచాయి. అయితే ఎస్ యూవీ అనగానే ధర విషయంలో ఎక్కువగా ఉంటుందని వినియోగదారులు భావిస్తారు. కానీ MG Astor లాంటివి మాత్రం వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగా అప్డేట్ ఫీచర్స్ ను అందుబాటులో ఉంచి ఆకర్షిస్తున్నాయి.