https://oktelugu.com/

Maruthi Swift: మైలేజ్ తో పాటు భద్రత కోరుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్..

మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్, బాలెనో, స్విప్ట్ కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. వీటిలో స్విప్ట్ ఇప్పటికీ అమ్మకాలు సాగుతున్నాయి. అయితే..

Written By:
  • Srinivas
  • , Updated On : January 26, 2024 / 10:37 AM IST

    Maruthi Suzuki Swift New Model

    Follow us on

    Maruthi Swift: దేశీయ మార్కెట్లో మారుతి సుజుకీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. కార్ల వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షించేందుకు అప్డేట్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది కంపెనీ. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్, బాలెనో, స్విప్ట్ కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. వీటిలో స్విప్ట్ ఇప్పటికీ అమ్మకాలు సాగుతున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దీనిని కొత్త వెర్షన్ లో తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగా వచ్చే స్విప్ట్ లో సేప్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం..

    2024 ఏడాది సందర్భంగా కొత్త కార్లు వస్తున్నట్లు పలు కంపెనీలు ప్రకటించాయి. వీటిలో మారుతి సుజుకీ కూడా ఉంది. మారుతి నుంచి రెండు సంవత్సరాల కిందట మార్కెట్లోకి వచ్చిన స్విప్ట్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. దీనికి కొత్త టెక్నాలజీని జోడించి తీసుకొస్తున్నారు. కొత్తగా వచ్చే ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. అయితే పాత స్విప్ట్ కంటే ఇందులో CVT గేర్ బాక్స్ ను మర్చారు. ఇది 82 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    కొత్త కారు ఫీచర్స్ విషయానికొస్తే.. కొత్తగా ఎల్ ఈడీ ల్యాంప్ ను అమర్చారు. ప్రస్తుతం ఉన్న స్విప్ట్ కు డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. కానీ కొత్త వాటికి అలా కనిపించకుండా స్మార్ట్ గా అమర్చారు. ఇందులో అల్లాయ్ వీల్స్, టెయిల్ గేట్, సి స్టైల్ ఎల్ ఈడీ లైట్లు, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ కలర్, డ్యాష్ బోర్డు లే అవుట్ ను కలిగి ఉంది. ఈ కారు 3860 ఎంఎం పొడవు, 1695 ఎంఎం వెడల్పు, 1500ఎంఎం ఎత్తు, 2450 వీల్ బేస్ ఉంటుంది. అలాగే 265 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

    కొత్త స్విప్ట్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. 2026 నాటికి ఇది మార్కట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కారులు రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ట్రాపిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేటేస్ట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఫీచర్స్ తో పాటో భద్రత కోరుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇక ఈ మోడల్ 23.4 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.