https://oktelugu.com/

Maruti Suzuki : వ్యాగన్ ఆర్ (Wagon R )కు మించిన బెస్ట్ ఆప్షన్.. ఆ కారు ఏదో తెలుసా?

మారుతి సుజుకీ కార్ల కంపెనీ ఎదురు లేకుండా సాగింది. ఇప్పుడు మారుతి కార్లకు టాటా మోటార్స్ గట్టి పోటీ ఇస్తోంది. టాటా కంపెనీ నుంచి

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2024 / 10:08 AM IST

    Tata Tiago

    Follow us on

    Maruti Suzuki : తక్కువ ధరలో, బూట్ స్పేస్ ఎక్కువగా ఉండి.. మంచి ఫీచర్స్ కలిగిన కార్ల కోసం చాలా మంది వినియోగదారులు సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు పోటీ పడి మరీ ఇలాంటి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. నిన్నటి వరకు మారుతి సుజుకీ కార్ల కంపెనీ ఎదురు లేకుండా సాగింది. ఇప్పుడు మారుతి కార్లకు టాటా మోటార్స్ గట్టి పోటీ ఇస్తోంది. టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొన్ని కార్లు మారుతి కార్ల కంటే బెస్ట్ అని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యాగన్ ఆర్ కంటే ఓ కారు టాటా మోటార్స్ ఇంప్రెస్ చేస్తోందని అంటున్నారు. ఇంతకీ ఈ కారు ఏదో తెలుసుకుందామా..

    మారుతికి కంపెనీ కి చెందిన వ్యాగన్ ఆర్ (Wagon R) గురించి కారు వాడే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ జరిపే అమ్మకాల్లో ఈ మోడల్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. 2023 ఏడాదిలో మారుతి జరిపిన విక్రయాల్లో వ్యాగన్ ఆర్ ఎక్కువగా అమ్ముడుపోయింది. ఆ తరువాత స్విప్ట్ నిలిచింది. 2019 లో మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్ ఇప్పటికే అప్డేట్ ఫీచర్సతో అందుబాటులోకి వచ్చి ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఈ వ్యాగన్ ఆర్ ను టాటాకు చెందిన టియాగో (Tiago) బీట్ చేసింది. అచ్చం వ్యాగన్ ఆర్ లాగే ఉండే ఇందులో అంతకుమించి అన్నట్లు కొన్ని ఫీచర్స్ ఆకర్షిస్తున్నాయి.

    టాటా మోటార్స్ కు చెందిన టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో కలిగి ఉంది. 72 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా టియాగో పెట్రోల్ తో పాటు CNG ఎంపిక కూడా ఉంది. ఇది XE CNG 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. అయితే త్వరలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో రిలీజ్ కానుంది. 5 సీట్ల సౌకర్యంతో ఉన్న ఇందులో అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటేమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పవర్ వంటి ఫీచర్స్ ఆకర్షిస్తున్నాయి.

    టాటా టియాగో 4 స్టార్ క్రాష్ భద్రతను కలిగిస్తుంది. ఇది గ్లోబర్ NCAP టెస్టింగ్ లో 1 స్టార్ సేప్టీ రేటింగ్ ను పొందింది. ఈ సీఎన్ జీలో లీటర్ పెట్రోల్ కు 26.49 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6.55 లక్షల ప్రారంభ ధరలో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో ఇలాంటి ఫీచర్స్ తో పాటు ఇదే ధరతో వ్యాగన్ ఆర్ ఆకర్షించింది. కానీ టియాగో సైతం 242 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీంతో వ్యాగన్ ఆర్ కంటే ప్రత్యామ్నాయంగా కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఎందుకంటే CNG ఎంపిక చేసుకునే వారికి టాటా టియాగో మెరుగ్గా పనిచేస్తుంది. వ్యాగన్ ఆర్ CNG 55.92 బీహెచ్ పీ పవర్ ను మాత్రమే అందించగా.. టాటా టియాగో 72 బీహెచ్ పీ పవర్ ను అందిస్తోంది. అయితే మైలేజ్ విషయంలో మాత్రం వ్యాగన్ ఆర్ 34.05 కిలోమీటర్లతో టియాగో కంటే మెరుగ్గా ఉంది.