Maruthi Cars: కార్ల ఉత్పత్తిలో ఎప్పుడూ అగ్రస్థాయిలో ఉంటోంది మారుతి కంపెనీ. దీని నుంచి రిలీజైన కొన్ని పాత మోడళ్లు సైతం ఇప్పటికీ విక్రయాలు జరుపుకుంటున్నాయి. వీటిలో స్విప్ట్ ఒకటి. స్విప్ట్ గత ఫిబ్రవరి నెలలో టాప్ పొజిషన్లో ఉంది. అయితే దీనిని నేటి వినియోగదారులకు అనుగుణంగా మార్చి కొత్త తరహా స్విప్ట్ ను తీసుకొస్తున్నారు. దీనితో పాటు డిజైర్ కూడా కొత్త మోడల్ వస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి స్విప్ట్, డిజైర్ లో ఉండే మార్పులు ఏవి? వాటి ఫీచర్లు, ధరలు ఎలా ఉండనున్నాయి? అనే వివరాల్లోకి వెళితే..
ఫీచర్స్ విషయంలో..
వినియోగదారులకు అనుగుణంగా మారుతి కార్లు ఉంటాయని కొందరి నమ్మకం. అందుకే ఈ కంపెనీ నుంచి ఎలాంటి మోడల్ వచ్చినా ఆసక్తి కనబరుస్తారు. తాజాగా మారుతి నుంచి వచ్చే కొత్త స్విప్ట్ (2024) ను ఇప్పటికే జపాన్ లో ఆవిష్కరించారు. పాత స్విప్ట్ తో పోలిస్తే కొత్త స్విప్ట్ బాడీలో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఐకానిక్ డిజైన్ గా తయారు చేశారు. కొత్త కారు లో బంపర్లు, లైట్లు, అలాయ్ వీల్స్, రేర్ డోర్ హ్యాండిల్స్ ను లేటేస్టుగా అమర్చారు. డిజైర్ విషయానికొస్తే పాత కారు కంటే కొత్త దానిలో బూట్ స్పేస్ పెంచారు. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కొత్త డయల్స్, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను అమరుస్తారు. కొత్త సన్ రూప్ ను సెట్ చేసే అవకాశం ఉంది.
ఇంజిన్ ఎలా ఉంటుందంటే?
2024 స్విప్ట్ లో ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. కొత్త మోడల్ లీటర్ కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. Suzuki Z12E పేరుతో ఉన్న కొత్త మూడు సిలిండర్లు, నేచురల్ అస్పిరేటెడ్ యూనిట్ గా పనిచేయనుంది. ప్రస్తుతం ఇంత వరకే వివరాలు బటయకు వచ్చాయి. డిజైర్ కు సంబంధించిన ఇంజిన్ లో కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.
ఇక ధర విషయంలోనూ చాలా స్వల్ప మార్పులు మాత్రమే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త స్విప్ట్ ను రూ.6.60 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. డిజైర్ సైతం రూ.6.60 లక్షల ఎక్స్ షోరూం ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్విప్ట్, డిజైర్ లో అత్యంత ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. అయితే లేటేస్టు గా అప్డేట్ చేసిన ఈ మోడళ్లు కూడా వినియోగదారులు ఆదరిస్తారని కంపెనీ భావిస్తోంది. అతి త్వరలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే వెల్లడించారు.