spot_img
Homeబిజినెస్Maruti Alto K10: మారుతి కొత్త ఆల్టో కే 10 లో ఉండే స్పెషల్ ఏంటో...

Maruti Alto K10: మారుతి కొత్త ఆల్టో కే 10 లో ఉండే స్పెషల్ ఏంటో తెలుసా..?

Maruti Alto K10: Maruti Suzuki కంపెనీ నుంచి కొత్త కారు మార్కెట్లోకి వచ్చిందంటే దానిపై ఆసక్తికర చర్చ ఉంటుంది. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఈ కంపెనీ కారులను తీసుకువస్తుంది. మరోవైపు ప్రీమియం కావాలని కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీ నుంచి దశాబ్దాల కిందట రిలీజ్ అయిన కొన్ని మోడల్స్ ను ఇప్పటికీ అప్డేట్ చేస్తూ ప్రవేశపెడుతోంది. వీటిలో భాగంగా Maruti Suzuki Alto K10 కారు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్లుగా మారిపోయింది. అయితే ఈ కారు నేటి తరానికి అనుగుణంగా మార్చి మార్కెట్లోకి తీసుకోవచ్చారు. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కారు విడుదల అయింది. ఇందులో ఉన్న విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొత్తగా కార్ కొనాలని అనుకునేవారు.. హ్యాచ్ బ్యాక్ కారు కావాలని అనుకునే వారికి మారుతి ఆల్టో k10 బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఎందుకంటే ఇది చిన్న ఫ్యామిలీకి అంగుళం గా ఉంటుంది. ఈ కారు ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు స్టైలిష్ గా మారిపోయింది. దీని బాహ్య డిజైన్ విషయానికి వస్తే LED హెడ్ లాంప్స్ నువ్వు అమర్చారు. క్రోమ్ వ్యాసాలతో గ్రిల్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ సైడ్ సైతం ఎల్ఈడి లైట్లతో కారుకు అందాన్ని తీసుకువచ్చాయి. పగలు, రాత్రి సమయాల్లో డ్రైవర్ కు అనుగుణంగా ఈ లైట్లు సౌకర్యాన్ని సురక్షితాన్ని ఇస్తాయి. ఈ కారు చిన్న పరిమాణంలో ఉండడంతో నగరాల్లో ఉండే వారికి టర్నింగ్ లేదా చిన్న రోడ్లపై వెళ్లడానికి కూడా అనుగుణంగా ఉంటుంది.

ఈ మోడల్ ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన క్లీనర్ క్యాబిన్ కొత్త లుక్ ను అందిస్తుంది. ఇందులో ఏర్పాటుచేసిన ఆటో సీట్లు ఎక్కువసేపు డ్రైవింగ్ లో ఉన్నా కూడా ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది. అలాగే వెనకవైపు కూర్చునే వారికి లెగ్ రూమ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారులో అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన టీచర్లను అమర్చారు. ఇందులో ప్రధానంగా అప్డేట్ చేసిన ఇంకోటైన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఆకట్టుకుంటుంది. పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లే తో నావిగేషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే సంగీతం వినడానికి, స్మార్ట్ఫోన్ కనెక్ట్ కావడానికి అవసరమైన అప్లికేషన్లు సెట్ చేశారు. ఆడియో నియంత్రణ బటన్స్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ప్రీమియం కార్ల వాలే అనిపిస్తాయి.

2026 లో వచ్చిన ఈ కారులో ఇంజన్ పంపీరు మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఇందులో 998 కే సిరీస్ తో కూడిన గాసోలిన్ ఇంజన్ అమర్చారు. దీంతో నగరాల్లో డ్రైవ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే స్మూత్ డ్రైవింగ్ తో ప్రయాణం సులభంగా ఉంటుంది. ఇందన శక్తి తక్కువగా వినియోగం ఉండడంతో చాలావరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇక ఇది మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ తో పనిచేస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ABS టెక్నాలజీ, వెంట రిమైండర్, పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండడంతో ప్రయాణికులకు భద్రతను ఇస్తాయి. ఇది మార్కెట్లోకి వస్తే రూ.4 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular