https://oktelugu.com/

కార్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ కార్లపై భారీ డిస్కౌంట్..?

మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త ఏడాదిలో అన్ని కంపెనీల ధరలు పెరిగినప్పటికీ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకే కారును కొనుగోలు చేసే అవకాశాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీలోపు కొత్త కార్లను కొనుగోలు చేయడం ద్వారా భారీ తగ్గింపు ధరలకే కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ బీఎస్6 కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం గమనార్హం. ఎక్స్‌ఛేంజి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2021 / 07:01 PM IST
    Follow us on

    మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త ఏడాదిలో అన్ని కంపెనీల ధరలు పెరిగినప్పటికీ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకే కారును కొనుగోలు చేసే అవకాశాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీలోపు కొత్త కార్లను కొనుగోలు చేయడం ద్వారా భారీ తగ్గింపు ధరలకే కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ బీఎస్6 కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం గమనార్హం.

    ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌, క్యాష్ డిస్కౌంట్, ఇతర ఆఫర్లను కంపెనీ ఇవ్వనుంది. మహీంద్రా ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ఆల్టురస్‌ జీ4 మోడల్‌ కారును కొనుగోలు చేయడం ద్వారా అత్యధికంగా 2.20 లక్షల రూపాయల క్యాష్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేయలనుకునే వాళ్లు 50,000 రూపాయలు ఎక్స్‌ఛేంజి బోనస్‌, 16 వేల రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్, 20,000 రూపాయల వరకు ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

    మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ స్కార్పియోను కొనుగోలు చేయడం ద్వారా 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ కారు కొనుగోలుపై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ లో భాగంగా 15,000 రూపాయలు, క్యాష్‌ డిస్కౌంట్‌ 10,000 రూపాయలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ 4,500 రూపాయలు, అదనపు ఆఫర్ల కింద మరో 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఎక్స్‌యూవీ 500 కొనుగోలుపై 59 వేల రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

    కేయూవీ 100 నెక్స్ట్‌ కొనుగోలుపై 62,055 రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. బొలేరో కొనుగోలుపై 24,000 రూపాయలు, ది మర్రాజో ఎంపీవీ కొనుగోలుపై 36,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.