గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త.. రూ.50 లక్షల బెనిఫిట్..!

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్లను వాడే వాళ్లకు ఇన్సూరెన్స్ ను కల్పిస్తున్నాయి. ఏదైనా కారణం వల్ల గ్యాస్ సిలిండర్ పేలితే బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు ఆయిల్ కంపెనీలు ఏకంగా 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను కల్పిస్తూ ఉండటం గమనార్హం. గ్యాస్ పేలుడు సంభవించిన సమయంలో గ్యాస్ వినియోగదారులకు ఈ పాలసీ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలతో పెట్రోలియం […]

Written By: Navya, Updated On : April 14, 2021 3:31 pm
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్లను వాడే వాళ్లకు ఇన్సూరెన్స్ ను కల్పిస్తున్నాయి. ఏదైనా కారణం వల్ల గ్యాస్ సిలిండర్ పేలితే బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు ఆయిల్ కంపెనీలు ఏకంగా 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను కల్పిస్తూ ఉండటం గమనార్హం. గ్యాస్ పేలుడు సంభవించిన సమయంలో గ్యాస్ వినియోగదారులకు ఈ పాలసీ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

ఇన్సూరెన్స్ కంపెనీలతో పెట్రోలియం కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకుని ఇన్సూరెన్స్ ను అందిస్తున్నాయి. ఐసీఐసీఐ లంబార్డ్ ద్వారా హిందుస్తాన్ పెట్రోలియం, ఇండేన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు ఇన్సూరెన్స్ ను అందిస్తుండటం గమనార్హం. 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను పొందాలని అనుకునే వాళ్లు గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ జరిగిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఈ విషయాని తెలియజేయాలి.

ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల వరకు పరిహారం లభించనుండగా గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలితే సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌ కు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని పొందడానికి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్, మెడికల్ ట్రీట్‌మెంట్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ బిల్స్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ అందించి బీమా ప్రయోజనం పొందవచ్చు.

ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇన్సూరెన్స్ కోసం పాలసీని క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ డబ్బులు డిస్ట్రిబ్యూటర్‌ కు చేరిన తరువాత వినియోగదారులకు లభిస్తాయి. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ ధర 870 రూపాయలుగా ఉంది.