https://oktelugu.com/

Loan : సెకండ్ హ్యాండ్ కార్లకు లోన్ ఇస్తారా? వడ్డీ రేటు ఎలా ఉంటుంది?

ప్రస్తుతం కాలంలో సొంత కారు ఉండాలని చాలా మంది ఫ్యామిలీలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సొంత ఇల్లు ఉన్న వారు తప్పనిసరిగా కారును కొనుగోలు చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 28, 2024 / 08:24 AM IST

    loan

    Follow us on

    Loan : ప్రస్తుతం కాలంలో సొంత కారు ఉండాలని చాలా మంది ఫ్యామిలీలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సొంత ఇల్లు ఉన్న వారు తప్పనిసరిగా కారును కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు సొంత భవనాలు లేకున్నా కార్యాలయ అవసరాలకు కార్లను కొనుగోలు చేస్తున్నారు. కార్లకు డిమాండ్ పెరగడంతో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. అయితే కొంత మందికి కారు కొనాలని ఉన్నా.. సరైన బడ్జెట్ ఉండదు. దీంతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలని చూస్తారు.అయితే సెకండ్ హ్యాండ్ కారు బడ్జెట్ ను సైతం ఒకేసారి మొత్తం చెల్లించకుండా లోన్ తీసుకోవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అలాగే దీనిపై వడ్డీ రేటు ఎలా ఉంటుంది? అనే వివరాల్లోకి వెళితే..

    కొత్తకారు కొనుగోలు చేసినప్పుడు ఫైనాన్స్ ఇస్తాం.. అని బ్యాంకులు ఎలా ముందుకు వస్తాయో.. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే సమయంలోనూ అంతేస్థాయిలో బ్యాంకులు లోన్ ఆఫర్లు చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులకు సంబంధించిన ఫైనాన్స్ సంస్థలు ఈ కార్లపై లోన్ ఆఫర్లు చేస్తున్నాయి. వీటిలో మహీంద్రా ఫైనాన్స్, HDFC బ్యాంక్, బజాజ్ పిన్ సర్వ్, పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఐసీఐసీఐ, టాటా క్యాపిటల్ లు సెకండ్ హ్యాండ్ కారుపై లోన్ ను అందిస్తున్నాయి. వీటి నుంచి రుణం అందుకున్న వారుకొత్త కారు వలె ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

    ఒక వ్యక్తి కారును కొనుగోలు చేసిన తరువాత ఆ కారు నచ్చకపోవడంతో.. లేదా కొత్త మోడల్ కొనాలనే ఆశతో పాత కార్లను అమ్ముతూ ఉంటారు. అలాగే ఫైనాన్స్ ద్వారా కారు కొనుగోలు చేసిన వారు ఈఎంఐలు కట్టకపోవడంతో ఆ కారును ఫైనాన్స్ ఇచ్చిన సంస్థలు సీజ్ చేస్తాయి. ఇలాంటి కార్లను వేలం వేస్తాయి. వేలంలో పాట పాడి కారును దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇంకొందరు పాత కార్లను ఎక్చేంజ్ ఇచ్చి.. కొత్త కారును కొంటారు. ఇలాంటి కార్లను సైతం వేల వేస్తారు.

    ఈ కార్లను కొన్న కంపెనీలు నేరుగా విక్రయిస్తాయి. లేదా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే సంస్థలు ఉంటాయి. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తే లోన్ ను కచ్చితంగా ఇస్తారు.కానీ వీటిపై వడ్డీ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా కొత్త కారవలే దీనిపై 100 శాతం కాకుండా 70 శాతం మాత్రమే లోన్ ఇస్తారు. డాక్యుమెంట్లలో ఏమాత్రం తేడా ఉన్నా లోన్ ఇవ్వడానికి ముందుకు రావు. మారుతి వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ 20, టాటా నెక్సాన్ తో పాటు స్విప్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

    సెకండ్ హ్యాండ్ కారు దాదాపు సగం రేటుకే వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు డబ్బును రెడీ చేసుకొని ఒకేసారి మొత్తం చెల్లించి కారును కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు పై ఇచ్చే రుణం ప్రాసెస్ కష్టంగా ఉంటుంది. డాక్యుమెంట్లలో ఏవైనా లోపాలు ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.